జెన్ Z ట్రావెల్ రివల్యూషన్.. షార్ట్ ట్రిప్స్, బిగ్ ఫీల్స్!

by Javid Pasha |   (  Updated:2026-04-22 14:32:58  IST  )

ఒక నివేదిక ప్రకారం యువతలో 84% మంది సంవత్సరానికి 1 నుంచి 6 సార్లు ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. 72% మంది వారం రోజుల మధ్య మాత్రమే ఉండే షార్ట్ ట్రిప్స్‌ను ఇష్టపడుతున్నారు.

జెన్ Z ట్రావెల్ రివల్యూషన్.. షార్ట్ ట్రిప్స్, బిగ్ ఫీల్స్!
X

దిశ, ఫీచర్స్ : వెకేషన్ అంటే ఒకప్పుడు సుదూర గమ్యస్థానాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడమే లక్ష్యంగా ఉండేది చాలామందికి. ముఖ్యంగా భారతీయ యువత ఒక పెద్ద సాంప్రదాయిక వెకేషన్ కోసం ఎదురు చూసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. జెన్ - Z ఇప్పుడు పర్యటనలు, గమ్యస్థానాల విషయంలో చిన్న చిన్న ప్రయాణాలను కూడా ఇష్టపడుతోందని అగోడా కంపెనీ 2026 ట్రావెల్ అవుట్ లుక్ రిపోర్ట్‌ వెల్లడించింది.

ఏడాదికి ఆరుసార్లు

అగోడా నివేదిక ప్రకారం యువతలో 84% మంది సంవత్సరానికి 1 నుంచి 6 సార్లు ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 72% మంది 1 నుంచి 7 రోజుల మధ్య మాత్రమే ఉండే షార్ట్ ట్రిప్స్‌ను ఇష్టపడుతున్నారు. ఇది వారి బిజీ లైఫ్‌స్టైల్‌కి సరిపోయేలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని కూడా భావిస్తున్నారు. అందుకే నేటి యువత గమ్యస్థానం కంటే అనుభవాలు ముఖ్యం అవుతున్నాయి. సాంస్కృతిక లోతైన అన్వేషణలు (56%), అడ్వెంజర్ యాక్టివిటీస్ (36%), రిలాక్సేషన్ (72%) వంటి అనుభవాలు వారిని ఆకర్షిస్తున్నాయి. దేశీయ షార్ట్ గెట్‌వేస్‌తోపాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా బ్యాలెన్స్‌గా చేస్తున్నారు చాలామంది యువతీ యువకులు. ఈ విధంగా ప్రయాణం కేవలం ఒక్కసారితో ముగిసిపోయే ప్లాన్ కాకుండా.. రోజువారీ జీవితంలో భాగంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

57% అలా.. 22% ఇలా

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 57% మంది తమ పార్ట్‌నర్‌తో (జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ /గర్ల్ ఫ్రెండ్‌తో ట్రిప్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరో 22% మంది సోలో ట్రావెల్‌ను ఎంచుకుంటున్నారు. సాంప్రదాయ కుటుంబ ట్రిప్ నుంచి దూరంగా, వ్యక్తిగత స్వేచ్ఛ, ఫ్లెక్సిబిలిటీ, స్పాంటేనియస్ అనుభవాలపై దృష్టి పెడుతున్నారు. ఇది జెన్ Z ట్రావెల్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తోందని పర్యాటక నిపుణులు అంటున్నారు. మొత్తానికి భారతీయ యువతలో ట్రావెల్ ఇప్పుడు ‘లగ్జరీ’ కాకుండా జీవితంలో సహజమైన భాగంగా మారుతోంది. అంతేకాకుండా చిన్న చిన్న ట్రిప్స్ ద్వారా మెంటల్ హెల్త్, జ్ఞాపకాలు- అనుభవాలు, స్వేచ్ఛను సమతుల్యం చేసుకోవడానికి పర్యటనలు, వెకేషన్లను ఎంచుకుంటోంది.

జెన్-Z‌లో బెడ్ రాటింగ్.. విశ్రాంతి తక్కువ.. స్క్రోలింగ్ ఎక్కువ!

ప్రతీ పేరు ఒక సంగీతమే..! ఆ ఊరి ప్రత్యేకతే వేరు

Next Story