- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్-Zలో బెడ్ రాటింగ్.. విశ్రాంతి తక్కువ.. స్క్రోలింగ్ ఎక్కువ!
టెక్నాలజీని మన అవసరాలకు వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిస అవ్వడం మాత్రం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఏది కూడా అతిగా చేయడం మంచిది కాదంటారు నిపుణులు. సాంకేతికత విషయంలోనూ అది వర్తిస్తుంది. పరిమితికి మించి వాడటం, దుర్వినియోగం చేయడం వల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువ. అందుకు చక్కటి ఉదాహరణ జెన్- Zలో ట్రెండ్ అవుతున్న ‘బెడ్ రాటింగ్(bed rotting)’ ఒకటి. విశ్రాంతి పేరుతో గంటల తరబడి పడుకొని ఫోన్‌లో వీడియోలు చూడటం, స్క్రోల్ చేయడం ఇందులో భాగం. స్ట్రెస్ నుంచి రిలీఫ్ తీసుకోవడానికి ఒక మార్గంగా ఇటీవల ఈ ట్రెండ్ పాపులర్ అయింది. కొద్ది సేపు ఇలా రెస్ట్ చేసుకోవడం శరీరానికి, మనసుకి మంచిదే కానీ.. రోజూ ఇలా చేస్తే దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు.
టెక్నాలజీని మన అవసరాలకు వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిస అవ్వడం మాత్రం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుందంటున్నారు నిపుణులు. బెడ్ పడుకొని గంటలకొద్దీ స్క్రోల్ చేస్తుండటం అచ్చం అలాంటిదే. థెరపీ గ్రూప్ డీసీ అనే ఒక అధ్యయనం ప్రకారం.. బర్న్ అవుట్ లేదా ఒత్తిడి ఎక్కువైనప్పుడు చాలా మంది బెడ్ రాటింగ్ చేస్తారు. ఇక్కడ విశ్రాంతి కోసం పడుకోవడం తాత్కాలికంగా హాయిగా అనిపించినా బ్రెయిన్ అనేది నిజంగా రెస్ట్ తీసుకోకుండా ఉండిపోతుంది. దీనివల్ల మూడ్ డౌన్ అవుతుంది. అలసట ఎక్కువ అవుతుంది. ఆందోళన & డిప్రెషన్ పెరుగుతాయి. ఇది తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది తప్ప స్ట్రెస్‌ను పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఫోన్లో లేదా ట్యాబ్‌లో స్క్రోల్ చేస్తూ ఎక్కువసేపు కదలకపోవడంవల్ల శరీరం స్టిఫ్ అవుతుంది. ఎనర్జీ తగ్గుతుంది. ఒంటరిగా ఆన్‌లైన్‌లో గడపడంవవల్ల సామాజిక సంబంధాలు తగ్గి లోన్లీనెస్ పెరుగుతుంది. స్క్రోలింగ్ వల్ల డోపమైన్ షార్ట్ బర్ట్స్‌లు మాత్రమే వస్తాయి. తర్వాత మనసు మరింత అసంతృప్తి చెందుతుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? అంటే సెల్ఫ్-కేర్ ముఖ్యమంటన్నారు నిపుణులు. అందుకోసం రెస్ట్ తీసుకునే సమయంలో రెస్ట్ మాత్రమే తీసుకోవాలి. ఆ సమయాన్ని కూడా గంటల తరబడి ఫోన్లు చూస్తూ, వీడియోలు చూస్తూ, స్క్రోల్ చేస్తూ గడిపితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రమంగా ఇది నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. సో.. బీ కేర్‌ఫుల్ అంటున్నారు నిపుణులు.






