- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనిషి.. మరమనిషి.. ఆ సాంకేతికతకు పెరుగుతున్న ప్రయారిటీ
రోడ్లపై, ఇళ్ల మధ్య దూరాల్లో సరుకులు, ఆహారం డెలివర్ చేయడంలో అటానమస్ డెలివరీ రోబోట్స్ సహాయపడుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు వివిధ పనుల్లో మనిషికి మనిషి మాత్రమే సహాయపడే అవకాశం ఉండేది. కానీ నేడు ఆధునిక సాంకేతికత కూడా సహాయపడుతోంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎంతో మేలు జరుగుతోంది. మానవునికి శ్రమ తగ్గి సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. ఆయా రంగాల్లోని పనుల్లో, మెరుగైన ఆలోచనల్లో, వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీల్లో మనిషికి తోడుగా మరమనిషి సైతం సహకరిస్తున్నాడు. మానవులు క్రియేట్ చేస్తున్న రోబోలు, ఇప్పుడు మనిషికంటే వేగంగా ఆలోచిస్తూ.. వర్క్ చేస్తూ ఆఫీసు వర్కుల్లో, అభివృద్ధిలో, ఆయా సెక్టార్లలోని పనుల్లో సహాయపడుతున్నాయి. అలాంటి వాటిలో కన్‌స్ట్రక్షన్ రోబోట్స్, రోడ్ సైడ్ రోబోట్స్, జిప్టీ ది ఏఐ చెఫ్, రోబోట్, బోస్టన్ డైనమిక్స్ -అట్లాస్ రోబోట్స్, హైవోల్లేజ్ కేబుల్ రిపేరట్ బాట్స్ వంటివి ఉంటున్నాయి. వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్‌స్ట్రక్షన్ బాట్స్
కన్‌స్ట్రక్షన్ బాట్స్ ఇప్పుడు నిర్మాణ రంగంలో సౌకర్యవంతమైన గొప్ప మార్పును తెచ్చాయి. మానవుల కంటే 10 రెట్లు వేగంగా ఇండ్లు, భవనాలు నిర్మించడంలో సహాయపడుతున్నాయి. అధునాతన సాంకేతికత(Advanced technology)తో, కచ్చితమైన డిజైన్లను అమలు చేస్తాయి. ఇవి శ్రమను తగ్గించి, సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తాయి. ఫ్యూచర్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సైన్ రోబోలు
మారుతున్న కాలంలో రోడ్లపై, జాతీయ, అంతర్జాతీయ రహదారులపై సూచికల ఏర్పాటు, నిర్వహణ కేవలం మానవులు మాత్రమే మేనేజ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. అయితే సాంకేతికతతో ఇది చాలా సులభం అవుతన్నదని నిపుణులను అంటున్నారు. ముఖ్యంగా రోడ్డుపై సూచికల ఏర్పాటును ఆటోమేటిగ్గా హ్యాండిల్ చేయడంలో రోడ్ సైన్ రోబోలు సహాయపడుతున్నాయి. సైన్‌బోర్డులను ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించడంతో పాటు కచ్చితమైన ప్రదేశంలో మాత్రమే ఉంచేలా ఇవి సూచనలు ఇస్తాయి. మానవ తప్పిదాలను తగ్గించి, భద్రతను పెంచుతాయి. పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. రోడ్డు నిర్వహణలో సురక్షితమైన, నమ్మకమైన మార్పులు తేవడంలో ఇవి హెల్ప్ అవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
జిప్పిటీ ది ఏఐ చెఫ్
జిప్పిటీ ది ఏఐ చెఫ్ అనే పేరుగల రోబో 50 లక్షలకు పైగా వంటకాల డేటాతో శిక్షణ పొందిందని నివేదికల చెబుతున్నాయి. అందుకే మిషెలిన్ స్థాయి నాణ్యతతో వంటలు చేయగలదు. కిచెన్‌లలో మానవ శ్రమను తగ్గించడంతోపాటు సౌకర్యాన్ని కల్పిస్తుంది. సమయాన్ని ఆదా చేస్తూ, విభిన్న వంటకాలతో, విభిన్న రుచులను అందిస్తుంది. రెస్టారెంట్లు, ఇండ్లల్లో కుకింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కాదు. ఇటీవల ఈ రోబో ఫుడ్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని క్రియేట్ చేస్తోంది.
అట్లాస్ బై బోస్టన్ డైనమిక్స్
బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన అట్లాస్ రోబో ప్రస్తుతం కెమెరామెన్‌గానూ వర్క్ చేయగలదు. మూవీ షూటింగ్‌లలో కచ్చితమైన కెమెరా యాంగిల్స్‌ను క్యాప్చర్ చేయగలదు. మానవుల్లాగే బ్యాలెన్స్‌డ్‌గా మూవ్ అవగలదు. కఠినమైన, సంక్లిష్టమైన షాట్స్‌ను సులభంగా తీయగలదు. సినిమా, మీడియా రంగంలో ఇదొక వినూత్న మార్పునకు దారితీస్తున్నదని, భవిష్యత్తులో మరిన్ని రంగాల్లోనూ దీని ఉపయోగం, సేవలు పెరగనున్నాయని నిపుణులు అంటున్నారు.
అగ్రికల్చరల్ రోబోట్స్
వ్యవసాయ రంగంలో ఈ రోబోలు రైతులకు నిజమైన తోడుగా మారాయి. ఆటానమస్ వీడింగ్ రోబోట్స్ (ఉదా: EarthRover లాంటివి) కలుపు మొక్కలను గుర్తించి, హాని కలిగించకుండా నాశనం చేస్తాయి. హార్వెస్టింగ్ రోబోట్స్ పంటలు కోయడం, సార్ట్ చేయడం వంటి పనులను ఆటోమేటిగ్గా చేస్తాయి. మానవ శ్రమను భారీగా తగ్గించి, నీరు, ఎరువులు, సమయం ఆదా చేస్తాయి. ఇవి పంట దిగుబడిని పెంచి, ఎకో-ఫ్రెండ్లీ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్ ఫుడ్ సెక్యూరిటీకి దోహదపడుతున్నాయి.
ఆటానమస్ డెలివరీ రోబోట్స్
రోడ్లపై, ఇళ్ల మధ్య సరుకులు, ఆహారం డెలివర్ చేయడంలో ఇవి విప్లవాత్మక మార్పులు తెచ్చాయంటున్నారు నిపుణులు తెచ్చాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ లాంటి రోబోట్లు రాడార్లు, కెమెరాలు, సెన్సార్లతో సురక్షితంగా నావిగేట్ చేసి, కూరగాయలు, ఇంకా వివిధ ఆహారాలను ఇంటి వద్దకు చేర్చేస్తాయి. ట్రాఫిక్, వాతావరణం సవాళ్లను అధిగమించి, 24 గంటలు పనిచేస్తాయి. మానవ డెలివరీ పర్సన్ల శ్రమ, ఖర్చు తగ్గించి, ఎక్కువ మందికి వేగవంతమైన సర్వీస్ అందిస్తాయి. లాస్ట్-మైల్ డెలివరీలో ఇవి కొత్త ఎరాను సృష్టిస్తున్నాయంటున్నారు నిపుణులు.
వృద్ధుల సంరక్షణ రోబోట్స్
నిజమైన స్నేహితుల్లా వ్యవహరిస్తూ వృద్ధుల ఒంటరి జీవితాన్ని మార్చేస్తున్నాయి ఎల్డర్లీ కేర్ కంపానియన్ రోబోట్స్. ElliQ లాంటి AI సహచర రోబోట్లు చాట్ చేయడం, మందులు గుర్తు చేయడం, వ్యాయామాలను ప్రోత్సహించడం, కథలు చెప్పడం వంటివి చేస్తాయి. లోన్లీనెస్ తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంట్లోనే స్వతంత్రంగా ఉండాలనుకునే వృద్ధులకు భద్రత, సపోర్ట్ అందిస్తూ, ఫ్యామిలీ మెంబర్ల భారాన్ని కూడా తగ్గిస్తాయి. హెల్త్‌కేర్ రంగంలో ఇవి కొత్త హోప్‌ను ఇస్తున్నాయి.
సెర్చ్ అండ్ రెస్క్యూ రోబోట్స్
నిజానికి సెర్చ్ అండ్ రెస్క్యూ రోబోట్స్ డిజాస్టర్ సమయాల్లో జీవితాలను కాపాడే హీరోలని చెప్పవచ్చు. SMURF లాంటి మిని రోబోట్లు భూకంపాలు, అగ్ని ప్రమాదాల్లో నిర్మాణాల కింద చిక్కుక్కున్న వారిని థర్మల్ కెమెరాలు, సెన్సార్లు, మైక్రోఫోన్లతో కనుగొంటాయి. రెస్క్యూ టీములకు సమాచారం అందించి, మార్గం చూపిస్తాయి. మానవులు ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లకుండా చేసి, ఎక్కువమంది జీవితాలను కాపాడుతున్నాయి. భవిష్యత్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో ఇవి అనివార్యమవుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా ఏ రంగంలోనో కాకుండా అన్ని రంగాల్లోనూ మర మనుషులు మనిషి జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి.






