- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల ట్రావెల్ టెన్షన్: అధిక ప్యాకింగ్‌తో సూట్‌కేస్ మూసుకోలేక ఇబ్బందులు!
వారం ప్రయాణానికి సగటున 34 జతల అవసరం. కానీ చాలామంది 60కి మించి ప్యాక్ చేసుకుని ఇబ్బంది పడుతుంటారు.

దిశ, ఫీచర్స్ : ప్రయాణాలంటే అందరికీ ఇష్టమే. అయితే ఇవి అనుకున్నంత ఈజీ కూడా కాదు. అందుకే వెళ్లబోయేది సాధారణ ఊరా లేదా ఏదైనా పర్యాటక ప్రాంతమా? ఎన్ని రోజులో జర్నీ చేయాల్సి ఉంటుంది? అక్కడికెళ్లాక ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? వంటి ప్రణాళికలన్నీ ముందుగానే వేసుకొని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అవసరమైన వస్తువులు, దుస్తులు సర్దుకోవడం, ప్యాక్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ఈ ప్రయాణాలు, దుస్తులు సర్దుకోవడాలు వంటివి ఫిమేల్ ట్రావెల్స్‌లో ‘ఓవర్ ప్యాక్ ఒత్తిడి’కి దారితీస్తున్నాయని ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ వేదిక నిర్వహించిన సర్వే వెల్లడించింది. అవసరానికి మించి ఆందోళన చెందడం, దుస్తులు అధికంగా ప్యాక్ చేసుకోవడం ఇందుకు కారణమని తెలిపింది.
అవసరానికి మించి..
సర్వేలో భాగంగా నిపుణులు 2,000 మంది మహిళా ప్రయాణికులను ప్రశ్నించగా.. వారం ప్రయాణానికి సగటున 60 బట్టలు ప్యాక్ చేస్తున్నట్లు తేలింది. అయితే వాస్తవానికి 34 మాత్రమే అవసరమని కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. అలాగే 72% మంది మహిళలు ఎల్లప్పుడూ ఓవర్‌ప్యాక్ చేస్తామని అంగీకరించారు. అందులో 77% మంది ‘జస్ట్ ఇన్ కేస్’ అని అదనపు దుస్తులు ప్యాక్ చేస్తారు. ఫలితంగా, 65% మంది సూట్‌కేస్ మూసుకోవడంలో ఇబ్బంది పడతారు. 58% మంది విమానంలో తీసుకెళ్ల గల బరువు మితిని మించి కూడా లగేజ్ సర్దుకుంటుంటారు. తర్వాత ఇబ్బంది పడుతుంటారు.
అయినా తగ్గేదే లే..!
అసలే అధిక ఒత్తిడి, ఓవర్‌ప్యాకింగ్‌తో ఇబ్బంది ఉన్నప్పటికీ, 42% మంది మహిళలు విదేశాల్లో పర్యటించినప్పుడు మరిన్ని బట్టలు కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. సగటున మహిళలు 19 టాప్స్ (Shirts, T-shirts) ప్యాక్ చేసి కేవలం 10 మాత్రమే ధరిస్తున్నారట. అలాగే 16 బాటమ్స్ (Pants, shorts, leggings) ప్యాక్ చేసి 8 మాత్రమే ఉపయోగిస్తున్నారు. అంటే సూట్‌కేస్‌లో దాదాపు సగం వస్తువులు ఉపయోగపడకుండా మిగిలిపోతుంటాయి. పైగా దీని వల్ల ఒక్కొక్కరు 1/5 మంది అదనపు బ్యాగేజ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకిలా? అంటే.. ప్రయాణాల్లో ఎక్కువ సౌకర్యం, ఎక్కువ ఆప్షన్లు కావాలనే ఆత్రుత, భయంతో ఈ ఓవర్‌ప్యాక్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా అది అనవసర ఒత్తిడి, అనవసర ఖర్చులకు దారితీస్తున్నదని బాధితులు అంగీకరిస్తున్నారు. నిపుణులు కూడా చెబుతున్నారు. మినిమల్ ప్యాకింగ్‌కు ప్రయారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు.
Read More..






