Gen Z ఆలోచన మారుతోంది.. ఆల్కహాల్ సహ ఆ అలవాట్లపై అనాసక్తి!!

by Javid Pasha |   (  Updated:2026-01-07 06:47:41  IST  )

అంతర్జాతీయ ఆల్కహాల్ పానీయాల పరిశోధన సంస్థ రిపోర్ట్ ప్రకారం.. జెన్ జీలు (1997-2012 మధ్య జన్మించినవారు) మిలీనియల్స్, అంతకు మునుపటి తరాల కంటే కూడా మద్యం పట్ల తక్కువ ఆసక్తి చూపుతున్నారు

Gen Z  ఆలోచన మారుతోంది.. ఆల్కహాల్ సహ ఆ అలవాట్లపై అనాసక్తి!!
X

దిశ, ఫీచర్స్ : గత దశాబ్దంతో పోలిస్తే ఆధునిక యువత ఆలోచన మారుతోంది. ఆచరణ కూడా మారుతోంది. ముఖ్యంగా జెన్‌జీల(Gen Z)లో ఆరోగ్యకరమైన జీవితం, క్రమశిక్షణ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతోందని, వ్యక్తిగతంగా, సామాజికంగా ఎవరికీ ఇబ్బంది కలిగించని ఆనందకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్న ధోరణి వ్యాపిస్తోంది అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని యువత గత తరాలకంటే చాలా తక్కువ మద్యం సేవిస్తున్నదని, ఇక నుంచి మద్యం, ఇతర మత్తు పానీయాలను పూర్తిగా వదులుకోవాలని భావిస్తున్నదని ఇంటర్నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IWSR) నిర్వహించిన రీసెంట్ సర్వేలో వెల్లడైంది.

ప్రశ్నించడం, మార్చుకోవడం

అంతర్జాతీయ ఆల్కహాల్ పానీయాల పరిశోధన సంస్థ రిపోర్ట్ ప్రకారం.. జెన్ జీలు (1997-2012 మధ్య జన్మించినవారు) మిలీనియల్స్, అంతకు మునుపటి తరాల కంటే కూడా మద్యం పట్ల తక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో నిర్వహించిన సర్వేలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. దీనినే ‘సోబర్ క్యూరియాసిటీ’ ట్రెండ్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. అంటే మద్యపాన సేవనం తగ్గించడం, చెడు అలవాట్లను ప్రశ్నించడం, మార్చుకోవడం, ఆరోగ్యం, మానసిక శాంతి కోసం వాటిని పూర్తిగా మానేయడం ఈ కొత్త ధోరణిలో భాగం.

47% మంది ఫీలింగ్ ఇదే

ఒక వైపు మద్యం, చెడు అలవాట్లను పూర్తిగా నివారించే ‘సోబర్ క్యూరియాసిటీ’తో పాటు మరోవైపు ఇండియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఈతరం యువత బర్న్‌ అవుట్‌ను గౌరవించే ‘హస్టిల్ కల్చర్’ను తిరస్కరిస్తోంది. అంటే జీతం కంటే మానసిక శాంతి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగ సంతృప్తికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అంతే తప్ప ఎక్కువ జీతం కోసం అవస్థలు పడాలని అనుకోవడం లేదు. ముఖ్యంగా 47% మంది జెన్‌జీలు తమకు జీతం లేదా గుడ్ వర్కర్ అనే టైటిల్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌, వ్యక్తిగత ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్నారు. అదే సమయంలో తమకు నచ్చని సాంప్రదాయ వ్యవస్థలను ప్రశ్నిస్తూ తమకు నచ్చిన దారిలో నడుచుకునేందుకే మొగ్గు చూపుతోంది. ఈ విధమైన మార్పు క్రమంగా విస్తరిస్తోందని, అయితే పాత తరం వారికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించడంతోపాటు భయాన్ని కలిగిస్తోందని కూడా సర్వేలు ప్రస్తావిస్తున్నాయి. ఎందుకంటే ఇది స్థిరపడిపోయిన సామాజిక, ఆర్థిక నియమాలను సవాలు చేస్తోంది.

Read More..

సాఫ్ట్ గర్ల్ ఎరా : జెన్ Z యువతులు ఈ ట్రెండ్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు?

Next Story