డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచే సింపుల్ మెథడ్.. భోజనం తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి చాలు!

by Javid Pasha |

భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్ పోస్ట్‌ప్రాండియల్ గ్లైసీమియాను తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచే సింపుల్ మెథడ్..  భోజనం తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి చాలు!
X

దిశ, ఫీచర్స్ : డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? పెద్దగా రిస్క్ అవసరం లేని సింపుల్ మెథడ్ ఒకటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటంటే.. ప్రతీసారి భోజనం తర్వాత జస్ట్ 10 నిమిషాలు వాకింగ్ చేయడం. దీనివల్ల కండరాలు యాక్టివేట్ అయి, రక్తంలోని గ్లూకోజ్‌ను ఇన్సులిన్ సహాయం లేకుండానే గ్రహిస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో కాలేయం గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించి, రక్తంలో చక్కెరస్థాయిల పెరగకుండా నియంత్రిస్తుంది. దీంతోపాటు ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత వాకింగ్ పోస్ట్‌ప్రాండియల్ గ్లైసీమియా(భోజనం తర్వాత చక్కెర పెరుగుదల)ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ ప్రభావం ఆరోగ్యవంతుల నుంచి ప్రీడయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ బాధితుల వరకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ టైమింగ్ కూడా చాలా ముఖ్యం. భోజనం ముగిసిన 60 నుంచి 90 నిమిషాలలోపు మాత్రమే నడక ప్రారంభించడం ఉత్తమం అంటున్నారు హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే తిన్నతర్వాత వెంటనే లేదా త్వరగా నడవడంవల్ల గ్లూకోజ్ పీక్ స్థాయిని మరింత సమర్థవంతంగా తగ్గించవచ్చు. అయితే దీర్ఘకాలిక నింయత్రణ కోసం భోజనం తర్వాత 20 నుంచి 30 నిమిషాలోపు నడక ప్రారంభించడం మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద వ్యాయామాలు, జిమ్‌లో వర్కవుట్‌లు లేకుండానే ఈ విధంగా పదినిమిషాల నడకతో మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story