Health : ఒత్తిడి, ఆందోళనలకు దారితీసే ఆ 5 అలవాట్లు.. రిలీఫ్ కోసం ఏం చేయాలంటే..

by Javid Pasha |

Health : ఒత్తిడి, ఆందోళనలకు దారితీసే ఆ 5 అలవాట్లు.. రిలీఫ్ కోసం ఏం చేయాలంటే..

Health : ఒత్తిడి, ఆందోళనలకు దారితీసే ఆ 5 అలవాట్లు.. రిలీఫ్ కోసం ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో స్ట్రెస్, యాంగ్జైటీస్ ప్రధానంగా ఉంటున్నాయి. అనుకున్న పనులు జరగకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అనారోగ్యాలు సంభవించడంతోపాటు కొన్ని రోజువారీ అలవాట్లు కూడా ఆందోళన, ఒత్తిడికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేమిటి? ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కెఫిన్ అధిక వినియోగం

కాఫీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అతిగా తాగితే మాత్రం ఆందోళనకు దారితీస్తుంది. అందులోని కెఫిన్ మీలో అప్పటికే ఉన్న యాంగ్జైటీని మరింత ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆందోళన, భయం వంటివి పెరుగుతాయి. కెఫిన్ వాడకాన్ని తగ్గించాలంటున్నారు నిపుణులు.

పనులు వాయిదా వేయడం

ఆయా పనుల నిర్వహణలో చూద్దాం లే.. చేద్దాం లే అనే ధోరణి పలువురిలో ఆందోళనకు కారణం అవుతుంది. ముఖ్యంగా అవసరమైన సమయానికి చేయకుండా వాయిదా వేయడంవల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేసేకంటే.. కాస్త ఇబ్బంది అనిపించినా సమయానికి పూర్తి చేసుకోవడం మీలోని యాంగ్జైటీని తగ్గిస్తుంది.

నాణ్యమైన నిద్ర లేకపోవడం

ప్రస్తుతం యువతలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. రాత్రిళ్లు ఎక్కువసేపు స్క్రీన్లకు అతక్కుపోవడం, ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వేదికల్లో నిమగ్నమైపోవడం వంటి కారణాలతో చాలామంది సమయానికి నిద్రపోరు. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది. సమయానికి నిద్రలేకపోవడం కూడా శరీరంలో జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను పెంచుతుంది. మీరు యాంగ్జైటీస్ నుంచి బయటపడాలంటే సమయానికి నిద్రపోవడం మంచిది.

సోషల్ మీడియా అతి వినియోగం

సోషల్ మీడియాను మన అవగాహనకోసం, అవసరం కోసం ఉపయోగించుకోవడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే పనిగా రాత్రింబవళ్లు ఎక్కువ సమయం అందులోనే నిమగ్నమైపోతే మాత్రం స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరుగుతాయి. ఇటీవల యువతలో ఈ ధోరణి పెరుగుతోంది. వర్క్‌ప్లేస్‌లలో, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, కామెంట్లు, సంఘటనలు మీలో ఆందోళన కలిగించేవి కూడా కావచ్చు. కాబట్టి అలాంటి చాన్స్ ఉంటే సోషల్ మీడియాను లిమిటెడ్‌గా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతికూల ఆలోచనలు

ప్రతీ విషయంలో నెగెటివ్, పాజిటివ్ ఉంటాయి. కానీ కొందరు పాజిటివ్ వదిలేసి నెగెటివ్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. కాబట్టి మీలో ప్రతికూల ఆలోచనలు మెదులుతుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. వాటివల్ల ఏమిటి లాభం? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే సమస్య నుంచి బయటపడతారు. అలాగే ప్రతికూల పరిస్థితులను, ఆలోచనలను ఎదుర్కోవాలంటే మీలో విషయ పరిజ్ఞానం, అవగాన, సామాజిక స్పృహ కూడా అవసరం అంటున్నారు నిపుణులు.

Next Story