- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటి చూపును దెబ్బతీస్తున్న ఓవర్ టైమ్ స్క్రీన్ ఎఫెక్ట్.. 20-20-20 ఫార్ములాతో చెక్ పెట్టండిలా..
ఫోన్ లేదా ఏదైనా స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి.. మీకు 20 అడుగుల దూరంలో ఉన్న పరిసరాలను 20 సెకన్లపాటు తదేకంగా చూస్తూ ఉండాలి. దీనివల్ల మీ కళ్లపై పడే ఒత్తిడి, అసౌకర్యం తగ్గి కంటి చూపు మందగించే అవకాశాలు తొలగిపోతాయి.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, డెస్క్ టాప్‌లు, ట్యాబ్‌లు, టీవీలు కనీస అవసరాల్లో భాగమైపోయాయి. అయితే కొందరు పరిమితికి మించి వాటిని చూడటం, ఉపయోగించడం చేస్తుంటారు. అయితే ఓవర్ టైమ్ స్క్రీన్ ఎఫెక్ట్ క్రమంగా కంటిచూపును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచుగా చూసేవారిలో కంటి చూపు మందగించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ‘20-20-20 ఫార్ములా’తో లో విజన్ సమస్యకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
*స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్ మీరు యూజ్ చేస్తున్న పరికరం ఏదైనా కళ్లకు, వాటికి మధ్య సరైన దూరాన్ని పాటించాలి. కంటిచూపుపై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే.. సాధారణంగా 16 నుంచి 24 అంగుళాలు లేదా 40 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి, లైటింగ్ ఫోకస్ తగ్గుతాయి. దీంతోపాటు కాంట్రాస్ట్ అండ్ స్క్రీన్ బ్రైట్‌నెస్ కూడా మీ కళ్లకు ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి.
*స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండాలంటే మీరు స్ర్కీన్ చూస్తున్నప్పుడు ‘‘20-20-20’’ ఫార్ములాను ట్రైచేస్తే మంచి ఉపయోగం ఉంటుంది అంటున్నారు నిపుణులు. దీని సారాంశం ఏంటంటే.. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి.. మీకు 20 అడుగుల దూరంలో ఉన్న పరిసరాలను 20 సెకన్లపాటు తదేకంగా చూస్తూ ఉండాలి. దీనివల్ల మీ కళ్లపై పడే ఒత్తిడి, అసౌకర్యం తగ్గి కంటి చూపు మందగించే అవకాశాలు తొలగిపోతాయి.
*నిరంతరం స్క్రీన్ చూస్తూ ఉండటం కారణంగా కళ్లల్లో అసౌకర్యం, ఒత్తిడి పెరుగుతుంది. కంటి నరాలు, కండరాలు ఉద్రిక్తంగా మారుతాయి. అదే కంటిన్యూ అవుతుంటే కళ్లల్లో చికాకు, పొడిబారడం, బయటి పరిసరాలను చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా నీరు కారడం, కళ్లు లాగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యను నివారించడంలో 20-20-20 ఫార్ములా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని కంటి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.






