- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుసగా 4 రోజులు జంక్ ఫుడ్ తింటే.. మీ మెదడులో జరిగే మార్పులివే..!
జంక్ ఫుడ్స్ తరచుగా తినే అలవాటు లేదా వరుసగా నాలుగు రోజులపాటు ఇతర ఆహారాలకంటే ఎక్కువగా తిన్నప్పుడు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వాటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెరలు బ్రెయిన్ హిప్పోకాంపస్‌లో ప్రతికూల మార్పులను ప్రేరేపిస్తాయి.

దిశ, ఫీచర్స్ : చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, జిజ్జా, చిప్స్, చాక్లెట్లు, క్యాండీలు వంటి అధిక కొవ్వు, అధిక చక్కెరలు, అధిక సోడియం కలిగిన జంక్స్ ఫుడ్స్ తరచుగా తింటున్నారా? అయితే బీకేర్ ఫుల్! ఎందుకంటే వరుసగా 4 రోజుల పాటు వీటిని వరుసగా తింటే గనుక మీ మెదడు ఆరోగ్యంపై, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం.. వీటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెర వంటివి జ్ఞాపకశక్తి, అలాగే రివార్డ్ సిస్టమ్‌కు సంబంధించిన భాగాను ప్రభావితం చేస్తాయని తేలింది. అధ్యయనంలో భాగంగా అధిక సాచురేటెడ్ ఫ్యాట్ డైట్‌ను నాలుగు రోజులు ఎలుకలకు ఇచ్చినప్పుడు కూడా వాటి మెదడులో జ్ఞాపక శక్తికి కారణమయ్యే హిప్పోక్యాంపస్‌లో గ్లూకోజ్ వినియోగం దెబ్బతిని, నిర్దిష్ట న్యూరాన్లు అతిగా యాక్టివేట్ అయి జ్ఞాపకశక్తి ప్రాసెసింగ్‌ను దెబ్బతీసినట్లు పరిశోధకులు గుర్తించారు. మానవుల్లోనూ జంక్ ఫుడ్స్ ఈ విధమైన ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో చూద్దాం.
జంక్ ఫుడ్స్ తరచుగా తినే అలవాటు లేదా వరుసగా నాలుగు రోజులపాటు ఇతర ఆహారాలకంటే ఎక్కువగా తిన్నప్పుడు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వాటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెరలు బ్రెయిన్ హిప్పోకాంపస్‌లో ప్రతికూల మార్పులను ప్రేరేపిస్తాయి. న్యూరాన్లు అతిగా యాక్టివ్ అయి బలహీన పడటం వల్ల మెదడు మొద్దు బారుతుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. దీంతోపాటు జంక్ ఫుడ్‌లో రుచికోసం కొవ్వు, చక్కెర, ఉప్పు అధిక మోతాదులో ‘బ్లిస్ పాయింట్’ సృష్టిస్తారు. కాబట్టి ఇవి మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే కోరికను కలిగిస్తాయి. దీంతో జంక్‌ఫుడ్స్ అడిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడూ జంక్ ఫుడ్స్ తింటే పర్లేదు కానీ, రోజూ తింటే మాత్రం మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వాటిని అవాయిడ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More..
కాలేయ కొవ్వును కరిగిస్తున్న బ్లాక్ కాఫీ.. ఈ విధంగా తీసుకుంటేనే..!






