కాలేయ కొవ్వును కరిగిస్తున్న బ్లాక్ కాఫీ.. ఈ విధంగా తీసుకుంటేనే..!

by Javid Pasha |

చక్కెర, పాలు కలుపని బ్లాక్ కాఫీ తాగే అలవాటు శరీరంలో కొవ్వును, కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

కాలేయ కొవ్వును కరిగిస్తున్న బ్లాక్ కాఫీ.. ఈ విధంగా తీసుకుంటేనే..!
X

దిశ, ఫీచర్స్ : కాఫీ లిమిట్‌గా తాగితే ఆరోగ్యానికి మంచిదే. అతిగా తాగితే మాత్రం అంత మించిది కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఎందుకంటే కాఫీలో చక్కెర, పాలు కపులుతారు. కాబట్టి అదనపు కేలరీలు, అదనపు చక్కెరలు ఉంటాయి. అందుకే రోజుకు 2 లేదా 3 కప్పులకు మించి ఎక్కువసార్లు కాఫీ తాగుతూ ఉంటే కూడా అధిక బరువు, మెటబాలిజం మందిగించడం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే అందుకు బదులుగా చక్కెర, పాలు కలుపకుండా కేవలం బ్లాక్ టీ తాగితే మాత్రం అద్భుతమై ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగు పర్చడమే కాకుండా శరీరంలో, ముఖ్యంగా కాలేయ కొనవ్వును కరిగించడంలో కీ రోల్ పోషిస్తుందని, హై ఫ్యాట్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చక్కెర, పాలు కలుపని అచ్చమైన బ్లాక్ కాఫీ తాగే అలవాటు శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో థర్మోజెనిసిస్ ప్రక్రియను పెంచుతాయి. ఇది కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం.. బ్లాక్ కాఫీ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)ను నివారిస్తుంది. హెపాటిక్ ఫ్యాట్ డిపాజిట్‌ను తగ్గించి మెటబాలిక్ జీవక్రియను సమతుల్యం చేస్తుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులలో కొవ్వు శాతాన్ని 10% బర్న్ చేస్తుంది. ఇది ఆకలిని అణచివేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది. అంతేకాకుండా బ్లాక్ కాఫీ లివర్ ఫ్యాట్ అక్యుములేషన్‌ను తగ్గిస్తుంది. ఎంజైమ్ లెవల్స్‌ను మెరుగుపరుస్తుంది. ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల నుంచి రక్షణ అందిస్తుంది. మోడరేట్ కాఫీ తీసుకోవడం లివర్ హెల్త్‌కు మంచిదని, డిటాక్స్‌ను సహజంగా బూస్ట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకు 3-4 కప్పులు బ్లాక్ కాఫీ తాగడం లివర్ ఫ్యాట్‌ను డిసాల్వ్ చేయడంలో సహాయపడుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు సైతం సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు నిపుణులను సంప్రదించగలరు.

Next Story