- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీప్రొడక్టివ్ హెల్త్‌ను మెరుగు పరిచే అద్భుతమైనా చిట్కా..! రోజూ ఇలా చేస్తే చాలు
మెంతుల్లో ఉండే ఫైబర్, ఫైటో ఎస్ట్రోజెన్లు, అలాగే సపోవిన్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. మెన్‌స్ట్రువల్ సైకిల్‌ను రెగ్యులర్ చేస్తాయి.

దిశ, ఫీచర్స్ : ఇండ్లల్లో సాధారణంగా వాడే మెంతులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోనాలను కలిగిస్తాయనే విషయం తెలిసిందే. అయితే అవి రీ ప్రొడక్టివ్ హెల్త్‌ను మెరుగు పరచడంలోనూ సహాయపడతాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన మెంతి గింజల వాటర్‌ను ఖాళీ కడుపున తీసుకోవడం మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగ పడతాయి. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతుల్లో ఉండే ఫైబర్, ఫైటో ఎస్ట్రోజెన్లు, అలాగే సపోవిన్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. మెన్‌స్ట్రువల్ సైకిల్‌ను రెగ్యులర్ చేస్తాయి. కొన్ని క్లినికల్ అధ్యయనాల్లో కొన్ని క్లినికల్ అధ్యయనాల్లో మెంతి గింజల సారం(Fenugreek Seed Extract) ఓవరీ వాల్యూమ్ తగ్గడం, సిస్టుల సంఖ్య తగ్గడం, మెన్‌స్ట్రువల్ సైకిల్ సాధారణం కావడం వంటి మెరుగైన ఫలితాలు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. హార్మోనల్ బ్యాలెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు ఓవమ్(egg) నాణ్యతను మెరుగు పరచడంలోనూ సహాయపడతాయి. ఇన్సులిన్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచడం ద్వారా అండాల అభివృద్ధి(Egg development)ని మెరుగు పరుస్తాయి. ఇది పీసీఓఎస్ సంబంధిత ఇన్ఫెర్టిలీటీ సమస్యలను తగ్గించడానికి సహజమైన మార్గంగా ఆయుర్వేదిక్ వైద్యులు సూచిస్తున్నారు. అయితే మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవడం, మెంతి వాటర్ తాగడం ఒక్కటే పూర్తి నివారణ గానీ, చికిత్స గానీ కాదు. ఆహారం, వ్యాయామం, డాక్టర్ సలహాతో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎలా తీసుకోవాలి?
రాత్రిపూట ఒక టీ స్పూన్ మెంతి గింజలను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపున ఆ నీటిని తాగాలి. మెంతులు కాస్త చేదుగా అనిపిస్తాయి కాబట్టి అందిరికీ నచ్చకపోవచ్చు. అయితే చిన్న మోతాదు మొదలు పెట్టి నెమ్మదిగా పెంచుకోవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గర్భిణులు ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు (గర్భాశయ సంకోచాలు రావచ్చు), వీరితోపాటు అలర్జీ ఉన్నవారు, బ్లడ్ షుగర్ మందులు వాడేవారు, PCOS లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తప్పక తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
అజీర్తితో అవస్థలా..? బొప్పాయితో చెక్!






