- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజీర్తితో అవస్థలా..? బొప్పాయితో చెక్!
బొప్పాయి ఒక సాధారణ పండు మాత్రమే కాదు. డైజెస్టివ్ హెల్త్‌ను మెరుగు పరిచే ఔషధం లాంటిది కూడా!

దిశ, ఫీచర్స్ : అన్ని ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల వద్దకే పరుగెత్తా్ల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని దూరం చేసే సహజమైన ఆహారాలో, చిట్కాలో కూడా ఉంటాయి. వాటిని ఫాలో అయితే చాలు అంటారు పెద్దలు. చాలా సమస్యలను మనం తీసుకునే ఆహారాల ద్వారా నివారించే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా చెబుతుంటారు. అలాంటి వాటిలో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇది అజీర్తిని దూరం చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పోషకాహార నిపుణుల ప్రకారం.. బొప్పాయి ఒక సాధారణ పండు మాత్రమే కాదు. మన డైజెస్టివ్ హెల్త్‌ను మెరుగు పరిచే ఔషధం లాంటిది కూడా. ఎందుకంటే ఇందులో సహజంగానే పాపైన్ (Papain) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా భోజనం తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించి, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.
బొప్పాయి ఎందుకు బెస్ట్?
* బొప్పాయిలోని సహజ ఎంజైములు ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.
*తింటే కడుపులో తేలికగా ఉన్న భావన ఏర్పడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
*విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉండటంవల్ల రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది.
ఎలా తినాలి?
ఉదయం ఖాళీ కడుపున లేదా భోజనం తర్వాత కొన్ని తాజా బొప్పాయి ముక్కలు తినడం మంచిదంటారు పోషకాహార నిపుణులు. ఇతర ఆహారాలతో కలిపి కూడా తినవచ్చు. కానీ అలా చేయకుండా నేరుగా తినడంవల్ల మరింత మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా పండిన బొప్పాయిని తినడం బెటర్. తరచుగా బొప్పాయి తినేవారిలో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అయితే అలర్జీలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






