- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొబ్బరి నీళ్లు, జామకాయ.. గొంతు నొప్పి, జలుబును పెంచుతాయా? తగ్గిస్తాయా?
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. జలుబు, గొంతు నొప్పి వంటి అనారోగ్యాల సమయంలో తాగడం మరింత సురక్షితం.

దిశ, ఫీచర్స్ : ‘మీకు జలుబు, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా? అయితే కొబ్బరి నీళ్లు తాగకండి. జామకాయ అస్సలే తినకండి. అలా చేస్తే ఈ సమస్య మరింత అధికం అవుతుంది’ అంటుంటారు కొందరు. కానీ ఇది వాస్తవం కాదంటున్నాయి ఆధునిక అధ్యయనాలు. వాటివల్ల జలుబు చేస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కేవలం మిథ్య మాత్రమేనని పేర్కొంటున్నాయి. ఆయుర్వేదంలో కొబ్బరినీళ్లు, జామకాయ శీతల గుణం కలిగినవిగా పరిగణించడంవల్ల అవి జలుబును ప్రేరేపిస్తాయనే నమ్మకం ప్రచారంలో ఉంది తప్ప వాస్తవానికి వాటివల్ల జలుబు, గొంతు నొప్పి వంటివి పెరిగే చాన్స్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొబ్బరి నీళ్లు తాగితే..
మయోక్లినిక్, అపోహాస్పిటల్స్ డాక్టర్ల అధ్యయనాల ప్రకారం.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి. కాబట్టి జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్యాల సమయంలో వీటిని తాగడం మరింత సురక్షితం. అలాగే గొంతు నొప్పి సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే జలుబు ఉన్నప్పుడు కూడా 1-2 గ్లాసులు (240-480 ml) కోకోనట్ వాటర్ తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లను కాస్త తక్కువగా తాగాలి.
జామకాయ తింటే..
జామలో విటమిన్ సి, ఎక్కువగా ఉంటుంది. ఒక ఆరెంజ్‌కంటే ఇందులో 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. పైగా విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు జలుబు లక్షణాల తీవ్రతను 15% వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు (meta-analysis, PMC studies) చెబుతున్నాయి. యాంటాక్సిడెంట్ గుణాలు కూడా కలిగి ఉండటంవల్ల జలుబు ఉన్నప్పుడు జామయ కాయ తినడంవల్ల దాని తీవ్రత తగ్గే అవకాశమే ఎక్కువ. అంటే జామకాయ తింటే జలుబు అవుతుందనేది కేవలం అపోహ మాత్రమే. ఫైనల్లీ కొబ్బరి నీళ్లు, జామ వంటివి జలుబు, గొంతు నొప్పి సమస్యను పెంచవు. పైగా తగ్గిస్తాయి.






