- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్ నెక్ సిండ్రోమ్.. స్క్రీన్ టైమ్ వల్ల పెరుగుతున్న ముప్పు!
నిరంతరం స్క్రీన్‌లవైపు తలదించుకొని చూడటంవల్ల ‘టెక్ నెక్ సిండ్రోమ్ వస్తుంది. ఇదొక ఆధునిక ఆరోగ్య సమస్యగా మారుతోంది.

దిశ, ఫీచర్స్ : గంటల తరబడి ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో నిమగ్నమై ఉంటున్నారా? కంప్యూటర్ ముందునుంచి కదలకుండా కూర్చుంటున్నారా? అయితే దాని మూల్యం మీ మెడ చెల్లించుకోవాల్సి వస్తుంది! ఎందుకంటే.. నిరంతరం స్క్రీన్‌లవైపు తలదించుకొని చూడటంవల్ల ‘టెక్ నెక్’ సిండ్రోమ్ (Tech Neck Syndrome) వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక ఆధునిక ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎలా వస్తుంది? లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఏం జరుగుతుంది?
*తల ముందుకు వంచడం వల్ల మీ వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది.
*సుమారు 45° కోణంలో, మీ మెడ 20–25 కిలోలకంటే ఎక్కువ బరువు మోస్తుంది
*ఇది నొప్పి, బిగుతు, అలాగే లాగ్ టెర్మ్ బాడీ పోశ్చర్(Long-term body posture) నష్టానికి దారితీస్తుంది.
సాధారణ లక్షణాలు
*మెడ, భుజాల్లో నొప్పి
*తలనొప్పి, అలసట
*కదలిక తగ్గడం
*చేతుల్లో జలదరింపు లేదా తిమ్మిరి
ఎవరిలో ఎక్కువ
*మధ్యలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా గంటల తరబడి స్క్రీన్లను చూస్తూ గడిపేవారిలో.. అంటే ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, డెస్క్‌టాప్‌లు వంటివి పరిమితికి మించి చూడటంవల్ల ‘నెక్ టెక్’ సమస్య తలెత్తుతుంది.
*విద్యార్థులు, ఉద్యోగులు, నిపుణులు, టీనేజర్లపై కూడా ప్రభావం చూపుతుంది.
*నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వెన్నెముక సమస్యలకు దారితీయవచ్చు.
ఎలా నివారించాలి?
*స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తల వంచకూడదు. అంటే ఐ లెవెల్‌కి సమానంగా ఉండేలా ఉంచాలి.
*20-20-20 రూల్ ఫాలో అవండి. అంటే ప్రతీ 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకన్లపాటు చూడాలి. ఈ పద్ధతి కంటి కండరాలకు విశ్రాంతినిస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. పొడి కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది.
*తరచుగా విరామం తీసుకోండి. కూర్చున్నప్పుడో, నడస్తున్నప్పుడో శరీరాన్ని సాగదీయండి.
*కూర్చున్నప్పుడు సరైన భంగిమను పాటించండి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






