- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన టచ్ చేస్తేనే చెమటలు పట్టేస్తున్నాయ్..! ఏం చేయమంటారు?
నొప్పితో కూడిన ఫస్ట్‌నైట్ అనుభవాలను స్నేహితులు పంచున్నప్పుడు వినడం కూడా పెళ్లి తర్వాత సెక్స్ పట్ల భయాన్ని కలిగించవచ్చు!

ప్రశ్న : మేడం నాకు పెళ్లై ఏడాదవుతోంది. వయసు 23 ఏళ్లు. భర్తతో సెక్స్ జీవితం అంటేనే భయంగా ఉంటోంది. ఆయన ముట్టుకుంటేనే చమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది. దీంతో నా భర్త నన్ను ముట్టుకోవడానికే భయపడుతున్నారు. అదే సమయంలో అసంతృప్తితో, చిరాకు, కోపం ప్రదర్శిస్తున్నాడు. మా సమస్యకు పరిష్కారం తెలుపండి? - లావణ్య, కరీంనగర్
జవాబు: అమ్మా.. నీ సమస్యను ‘సెక్స్ ఫోబియా’ అంటారు. అనేక కారణాలవల్ల ఈ రకమైన భయం ఏర్పడుతుంది. దీనికి నీ వ్యక్తిత్వ వికాస సమయంలో, బాల్య, కౌమార, యవ్వన దశల్లో ఎలాంటి అనుభవాల మధ్య గడిపావు లేదా నీకు ఈ రకంగా సెక్స్ పట్ల భయం, విముఖత ఏర్పడటానికి ఎలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ దొరికింది అనేది ఆలోచించాలి. అశాస్త్రీయమైన, అపోహలతో కూడిన భయం, అసహ్యం, కలిగించే సెక్స్ ఎడ్యుకేషన్ వివిధ మాధ్యమాల ద్వారా అందడం ఉదా: స్నేహితురాళ్లు, సినిమాల్లో రేప్ & ప్రసవం వంటి దృశ్యాలు, హింసాత్మక పోర్న్ సైట్స్, తల్లిదండ్రుల భయాలు ఇవన్నీ అమ్మాయిల్లో పెళ్లి అన్నా, సెక్స్ అన్నా భయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రులు లైంగిక అవయవాల విధులపట్ల.. అంటే నెలసరి, టీనేజ్‌లో సెక్స్ హార్మోన్స్ వల్ల ప్రారంభమయ్యే శారీరక మార్పులు, వాటిపట్ల నెగెటివ్ ఆలోచలను పిల్లలముందు వ్యక్తం చేయడం, సెక్స్ అంటే పాపంగా, నీచంగా భావించడం ఇవన్నీ ఎదుగుతున్న పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ మీద బలమైన ప్రభావాన్ని చూపించి సెక్స్ పట్ల ప్రతికూల ఆలోచలనల్ని, భయాలను, అసహ్యాన్ని కలిగిస్తాయి.
తాము అందంగా లేమని, ఆకర్షించలేమనే ఆత్మన్యూనతా భావం కూడా సెక్స్‌పట్ల విముఖతకు కారణం అవుతుంది. నొప్పితో కూడిన ఫస్ట్‌నైట్ అనుభవాలను స్నేహితులు పంచున్నప్పుడు వినడం కూడా పెళ్లి తర్వాత సెక్స్ పట్ల భయాన్ని కలిగించవచ్చు. డిప్రెషన్, ఆందోళన, పూర్తి న్యూరోసిస్‌లతో బాధ పడటం, భర్త అసహజమైన శృంగార పద్ధతిని అవలంభించడం, హింసాత్మక పద్ధతులు పాటించడం, వేధించడం వంటివి కూడా సెక్స్‌పట్ల విముఖతకు, భయానికి దారితీస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. నువ్వు నీ భర్తతో కలిసి సెక్సాలజిస్టు లేదా మారిటల్ థెరపిస్టు& సైకోథెరపిస్టును కలవాలి. వారు సెక్స్‌పట్ల నీకున్న భయానికి మూల కారణాలను విశ్లేషించి, అవగాహన కల్పించి, భయం పోగొట్టే కౌన్సెలింగ్ ఇస్తారు. కారణాలు నీ భర్తలో ఉంటే అతనికి సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. మనో లైంగిక సమస్య ఉంటే చికిత్స అందిస్తారు. ఇద్దరికీ మారిటల్ & రిలేషన్‌షిప్ థెరపీ చాలా అవసరం.
డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






