- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు, బలమైన సామాజిక సంబంధాలు కూడా చాలా ముఖ్యమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులు కూడా ఇందులో భాగంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ నిపుణుల అధ్యయనం ప్రకారం.. నాణ్యమైన సంబంధాలు లోన్లీనెస్‌ను తగ్గించి, మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. భావోద్వేగ నియంత్రణకు తోడ్పడతాయి.
అంతేకాకుండా స్లీప్ క్వాలిటీ (Sleep quality), స్ట్రెస్ లెవెల్స్, దీర్ఘకాలిక వ్యాధులు, జీవితకాలంపై కూడా సామాజిక సంబంధాలు ప్రభావం చూపుతాయి. ఈ సంబంధాల్లో చురుకుగా ఉండే వ్యక్తుల్లో (Among socially active people) గుండె జబ్బులు, మానసి కుంగుబాటు (Depression) వంటి ఆరోగ్య సమస్యలు తక్కువగా కనిపిస్తాయని, అలాగే వ్యాధుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక సన్నిహిత సంబంధాలైతే ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మొత్తానికి సామాజిక సంబంధాలు మానసిక స్థిరత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించడమే కాకుండా, జీవితంలో హ్యాపీనెస్‌ను, సానుకూల దృక్పథాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. Link






