ప్లాస్టిక్ బాటిల్‌‌తో నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్య తప్పదు!

by Javid Pasha |   (  Updated:2026-04-30 11:56:28  IST  )

ప్లాస్టిక్‌తో తయారైన ఫీడింగ్ ట్యూబ్‌లు, హైడ్రేషన్ పౌచ్‌లు, వాటర్ బాటిల్స్ నుంచి బయటకు వచ్చే రసాయనాలు సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి దారితీస్తాయి.

ప్లాస్టిక్ బాటిల్‌‌తో నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్య తప్పదు!
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, ఆరోగ్యానికి హానకరమని తెలిసిందే. కానీ మనం రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా నిద్రలేమి సమస్యకు దారితీస్తాయనే విషయం మీకు తెలుసా? రీసెంట్ స్టడీలో అదే వెల్లడైంది. ఎన్విరాన్మెంట్ ఇంటర్నెషనల్ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం ప్రకారం ఫీడింగ్ ట్యూబ్‌లు, హైడ్రేషన్ పౌచ్‌లు, వాటర్ బాటిల్స్ వంటి సాధారణ ప్లాస్టిక్ వస్తువుల నుంచి బయటకు వచ్చే రసాయనాలు మన సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తాయి. ఇది కెఫిన్‌తో సమానమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

రసాయనాలకు మూలం

సాధారణంగా బయటకు వెళ్లనప్పుడో, జర్నీ చేస్తున్నప్పుడో చాలా మంది తమ బ్యాగులో పెట్టుకునే ముఖ్యమైన వస్తువుల్లో వాటర్ బాటిల్ తప్పకుండా ఉండి ఉంటుంది. ఫంక్షన్లలో, వర్క్ ప్లేస్‌లలో కూడా వీటిని యూజ్ చేస్తుంటారు. అయితే వీటి వినియోగం మానవులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్లాస్టిక్ టాక్సికాలజీ నిపుణుడు వార్టిన్ వాగ్నర్ నేతృత్వంలోని పరిశోధకులు ప్రయత్నించారు. పీవీసీ(PVC), అలాగే పాలీయురేథేన్ ఉత్పత్తుల నుండి సంగ్రహించిన రసాయనాలను విశ్లేషించారు. ఈ ఉత్పత్తులు బొమ్మలు, ఫర్నిచర్, ఆహార ప్యాకేజింగ్‌లో సర్వసాధారణంగా ఉపయోగించబడుతుంటాయి.

జీవగడియారంపైనా ఎఫెక్ట్

తాజా పరిశోధనలో భాగంగా పీవీసీ(PVC), అలాగే పాలీయురేథేన్ ఉత్పత్తుల నుంచి సేకరించిన రసాయనాలను పరిశోధకులు ల్యాబ్ పరీక్షించారు. కాగా ఈ కెమికల్స్ కణాలలోని మాలిక్యులర్ క్లాక్ సిగ్నల్‌లను మార్చగలవని, శరీర జీవ గడియారాన్ని(body clock) 17 నిమిషాల వరకు ఆలస్యం చేయగలవని తేలింది. అంటే ఈ పరిస్థితి స్లీపింగ్ సైకిల్స్(sleep cycles)ను దెబ్బతీస్తుంది. ఊబకాయం, రోగనిరోధక వ్యవస్థ లోపాలు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇటీవల నిద్రలేమికి సమస్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అధిక వినియోగం కూడా ఒకటని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతి.. కోతలేకుండానే ట్యూమర్ల తొలగింపు!

Next Story