- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్కిన్సన్‌ను ట్రాక్ చేసే వేరబుల్ సెన్సార్లు.. ఏ విధంగా ఉపయోపగతాయంటే..
వేరబుల్ సెన్సార్లు పార్కిన్సన్ వ్యాధిని ట్రాక్ చేసి, సమాచారం అందిస్తాయి. వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగుల్లో వాకింగ్, నాన్ వాకింగ్ వంటి యాక్టివిటీస్‌ని కచ్చితంగా కొలుస్తాయి.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత ప్రతీ రంగంలో ఏదో ఒక రూపంలో ఉపయోగ పడుతోంది. ముఖ్యంగా వ్యాధులను లేదా వ్యాధి బాధితుల యాక్టివిటీస్‌ని ట్రాక్ చేయడంలోనూ, అలర్ట్ చేయడంలోనూ ఇది సహాయపడుతున్నది. ఇందులో భాగంగా పార్కిన్సన్ పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడే వేరబుల్ సెన్సార్లు(wearable sensors) విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీని కింగ్ చాంగ్ హో(King Chung Ho) అనే శాస్త్రవేత్త తన సహచర బృందంతో కలిసి అభివృద్ధి చేశాడు. ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
మార్పులను గుర్తిస్తాయి
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వేరబుల్ సెన్సార్లు పార్కిన్సన్ వ్యాధిని ట్రాక్ చేసి, సమాచారం అందిస్తాయి. అధ్యయనాల ప్రకారం ఇవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగుల్లో వాకింగ్, నాన్ వాకింగ్ వంటి యాక్టివిటీస్‌ని కచ్చితంగా కొలుస్తాయి. అంతేకాకుండా కొత్త సెన్సార్లు రోజువారీ జీవితంలోని డేటాను సేకరించి గైట్(నడక వేగం, స్టెప్ లెంగ్త్ , షఫ్లింగ్), సెడెంటరీనెస్ (కూర్చోవడం, నిలబడటం వంటి నిశ్చల సమయం) మార్పులను గుర్తిస్తాయి. ఇవి వ్యాధి ఎలా పురోగమిస్తున్నదో అబ్జెక్టివ్‌గా అర్థం చేసుకోవడానికి సహాయపడతుందని నిపుణులు అంటున్నారు.
అవగాహనకు సహాయం
వేరబుల్ సెన్సార్లు లేదా పరికరాలు రోగుల రియల్-వరల్డ్ డేటాను సేకరించడం ద్వారా ట్రెడిషనల్ క్లినికల్ అసెస్‌మెంట్‌ల కంటే ఎక్కువ కచ్చితమైన, సమగ్రమైన అవగాహనను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. నడక సమయంలో ఏర్పడే మార్పుల(Gait impairment)తో పాటు, నడకేతర సమయంలోని, అంటే ఎక్కువ నిశ్చలత, తగ్గిన ఫిజికల్ యాక్టివిటీస్ వంటి మార్పులను కూడా మెరుగ్గా మానిటర్ చేయడానికి, చికిత్సల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. మొత్తమ్మీద ఈ సాంకేతికత పార్కిన్సన్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.






