- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైక్రోనీడిల్ ప్యాచ్.. దంత చికిత్సలో కొత్త సాంకేతికత
మైక్రోనీడిల్ ప్యాచ్‌ను నేరుగా గమ్‌పై అప్లై చేస్తే చాలు. దెబ్బతిన్న దంత కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : దంత వైద్యంలో ‘డెంటిస్ట్ డ్రిల్’ అనేది ఒక ప్రధాన సాధనంగా ఉంటోంది. తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు రూట్ కెనాల్ చేయడం, దంతంలోని కొంత భాగాన్ని కట్ చేయడం వంటివి ఇందులో భాగంగా చేస్తుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా కేవలం దంతపై అమర్చడం ద్వారా మాత్రమే, పాడైపోయిన దంత భాగం పునరుద్ధరించే సాంకేతికతను దక్షిణ కొరియా పరిశోధకులు డెవలప్ చేశారు. దీనిని ‘మైక్రో నీడిల్ ప్యాచ్’ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోనీడిల్ ప్యాచ్‌ను నేరుగా గమ్‌పై అప్లై చేస్తే చాలు. చిన్న చిన్న సూదుల ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా, గ్రోత్ ఫ్యాక్టర్స్, టైడ్‌గ్లూసిబ్ వంటి రీజనరేటివ్ సమ్మేళనాలు కణజాలంలోకి చేరతాయి. ఇది బాల్యంలో దంతాలు పెరిగే జీవసంబంధ ప్రక్రియలను మళ్లీ యాక్టివేట్ చేసి, డెంటిన్, ఎనామెల్ వంటి దెబ్బతిన్న దంత కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. పైగా ఈ పద్ధతిని అవలంభించడానికి ఇంజెక్షన్, డ్రిల్లింగ్, ఇంప్లాంట్ సర్జరీ వంటివి అవసరం లేదు. కేవలం 20 నిమిషాలు గమ్‌పై ప్యాచ్ అప్లై చేస్తే చాలు. ఇది దంతాలు కోల్పోయిన లేదా దెబ్బతిన్న ప్రాంతాల్లో స్టెమ్ సెల్స్‌ను ఉత్తేజ పరిచి, కొత్త దంత కణజాలం ఏర్పడేలా చేస్తుంది. ల్యాబ్ టెస్టులు, ప్రారంభ అధ్యయనాల్లో డెంటిన్ పునరుత్పత్తి, చిన్న కుహరాలు నింపడ వంటి ఫలితాలు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇది దంతాలను కత్తిరించకుండా, సహజంగా మరమ్మతు చేసే ఆశాజనక సాంకేతికతగా నిపుణులు పరిగణిస్తున్నారు. అయితే టెక్నాలజీ ఇంకా పరిశోధనా దశలోనే ఉంది. క్లినికల్ అనుమతి పొంది అందుబాటులోకి వస్తే దంత వైద్య చికిత్సలో మరో అద్భుతమైన టూల్ వచ్చిచేరినట్లే అంటున్నారు పరిశోధకులు.






