Dehydration :నీరు తాగకపోతే మెదడుకు ముప్పు.. చిన్నపాటి డీహైడ్రేషన్ కూడా ప్రాణాంతకం కావచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-08-09 06:10:09  IST  )

మహిళల్లో 1.3%, అలాగే పురుషుల్లో 1.7% డీహైడ్రేషన్ కూడా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ పరిస్థితివల్ల మెదడు కణాలు సమర్థవంతంగా సమచారాన్ని ప్రాసెస్ చేయలేవు

Dehydration :నీరు తాగకపోతే మెదడుకు ముప్పు.. చిన్నపాటి డీహైడ్రేషన్ కూడా ప్రాణాంతకం కావచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. ఆ సమయంలో వెంటనే తగిన చికిత్స అందకపోతే మరణం సభవించే అవకాశమే ఎక్కువ. అందుకే ప్రతిరోజూ తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చిన్నపాటి డీహైడ్రేషన్ కూడా శరీరంలో ప్రతికూల మార్పులకు, అనారోగ్యాలకు దారితీస్తుందని, మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌ (The Journal of Nutrition)లో పబ్లిషైన తాజా అధ్యయనం పేర్కొన్నది. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో వివరంగా చూద్దాం.

శరీరం ప్రాణాంతకమైన డీహైడ్రేషన్ బారిన పడే పరిస్థితులు అరుదుగా సంభవిస్తుంటాయి. అయితే సరిపడా నీరు తాగకపోవడంవల్ల చిన్నపాటి డీహైడ్రేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉటుందని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మహిళల్లో 1.3%, అలాగే పురుషుల్లో 1.7% డీహైడ్రేషన్ కూడా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ పరిస్థితివల్ల మెదడు కణాలు సమర్థవంతంగా సమచారాన్ని ప్రాసెస్ చేయలేవు. ఎందుకంటే శరీరంలో నీటికొరత కారణంగా న్యూరాన్‌ల మధ్య సిగ్నల్ బదిలీకి (For signal transfer) అవసరమైన ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా రక్తప్రవాహం తగ్గి, మెదడుకు ఆక్సిజన్, పోషకాల సరఫరా తగ్గుతుంది. దీని కారణంగా అలసట, గందరగోళం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అందుకే ప్రతిరోజూ పెద్దలు కనీసం 8 గ్లాసుల వాటర్ తాగాలని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.

Next Story