Earn Money:20నిమిషాలు నిద్రపోయి లక్షలు సంపాదించవచ్చు.. మీరు కూడా పోటీకి దిగవచ్చు!

by Vennela |   (  Updated:2025-03-28 06:26:03  IST  )

Sleeping: ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.

Earn Money:20నిమిషాలు నిద్రపోయి లక్షలు సంపాదించవచ్చు.. మీరు కూడా పోటీకి దిగవచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: Sleeping: ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. మనం కూడా కొన్నింటినీ చూసి ఉండవచ్చు. అలాగే కొన్ని సార్లు అరే ఇలా కూడా జరుగుతుందా? లేదంటే ఇలాంటివి కూడా ఉంటాయా? అని మనం అనుకునే సందర్భాలు చాలానే ఉండవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

ఎవరికైనా కంటి నిండా నిద్రించాలని ఉంటుంది. అయితే చీటికి మాటికి నిద్రపోతూ ఉంటే నిద్ర మొహం నాయాలా అంటూ తిడుతుంటారు. అయితే నిద్రపోవడం ద్వారా కూడా లక్షలు సంపాదించవచ్చు ..అనుకుంటే.. అబ్బో నిద్రపోతే డబ్బులు ఇచ్చేది ఎవ్వరూ అని కూడా అంటుంటారు. అయితే మీరు ఇక్కడ నిద్రిస్తే చాలు డబ్బులు పొందవచ్చు. అది కూడా లక్షల్లో. ఎలా అనుకుంటున్నారా? అయితే మీరు స్పెయిన్ కు వెళ్లాల్సిందే. ప్రతి సంవత్సరం స్పెయిన్ లో నిద్ర పోటీలు జరుగుతుంటాయి. ఈ పోటీల కోసం అక్కడి జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇందులో పాల్గొనేవారు దాదాపు 1,000 యూరోలు సంపాదించవచ్చు. మన కరెన్సీలో 3 మిలియన్లకు సమానం.

స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో ఈ నిద్ర పోటీలు జరుగుతాయి. 2010లో స్పెయిన్ లో జరిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి నిద్ర పోటీ ఇది. ఈ విచిత్రమై పోటీకోసం ఎంతో మంది ఎగబడుతుంటారు. దీని లక్ష్యం నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు ప్రోత్సహించడం, జీవక్రియను మెరుగుపరుస్తుందని నిరూపించడం. అయితే ఇది కేవలం నిద్ర పోటీనే కాదు. స్పెయిన్ వినూత్న జాతీయ సియస్టా ఛాంపియన్‌షిప్. ఇది దేశ సాంప్రదాయ పగటి నిద్రను పునరుద్ధరించడానికి అంకింతం చేసిన కార్యక్రమం.

ఈ పోటీ రెండు వారాల పాటు ఉంటుంది. ఈ పోటీ ప్రత్యేకత ఏంటంటే కేవలం 20 నిమిషాలు గాఢ నిద్రలోకి జారుకోవడం. ఈ పోటీలో పాల్గొనేవారికి సోఫాలు, నిద్రించడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. లైఫ్‌గార్డ్ స్టాండ్‌పై కూర్చున్న జడ్జి గురక, లాలాజలం లేదా వినోదభరితమైన నిద్ర స్థానాల సంకేతాల కోసం గమనిస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రౌండ్ కు 30 యూరోలు లభిస్తాయి. అత్యధిక పాయింట్లు సాధించిన వారికి 1,000 యూరోలు పొందుతారు. 2010లో ఓ భవన కార్మికుడు 18 నిమిషాలు గాఢ నిద్రపోవడంతో 1,000యూరోలు గెలుచుకున్నాడు.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 20 నిమిషాలు పాటు నిద్రించడం వల్ల కలిగే లాభాల గురించి ఈ పోటీ తెలియజేస్తుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మొత్తం ఎనిమిది రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ ఖచ్చితంగా 20 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. ఐదుగురు పాల్గొనేవారికి వసతి కల్పిస్తుంది. పాల్గొనేవారు తమకు కేటాయించిన సమయంలో నిజంగా నిద్రపోతున్నారని నిర్ధారించుకోవడానికి, పల్సిమీటర్ వంటి పరికరాలతో కూడిన సర్టిఫైడ్ వైద్యుడు స్టాండ్ వద్ద ఉంటారు. ప్రతి రౌండ్ తర్వాత, మొదటి, రెండవ స్థానంలో నిలిచిన పాల్గొనేవారికి బహుమతులు ప్రదానం చేస్తారు. అదనంగా, ప్రతి రౌండ్‌లో పాల్గొనే ఐదుగురు పాల్గొనేవారికి పాల్గొనే చిహ్నంగా అధికారిక ఛాంపియన్‌షిప్ టీ-షర్టును అందిస్తారు.

Read More..

Viral : ఉదయం ఒకమ్మాయితో.. రాత్రికి మరో అమ్మాయితో.. !!

Next Story