Viral : ఉదయం ఒకమ్మాయితో.. రాత్రికి మరో అమ్మాయితో.. !!

by Javid Pasha |   (  Updated:2025-03-28 07:32:00  IST  )

Viral : ఉదయం ఒకమ్మాయితో.. రాత్రికి మరో అమ్మాయితో.. !!

Viral : ఉదయం ఒకమ్మాయితో.. రాత్రికి మరో అమ్మాయితో.. !!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని కొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తాయ్.. మనలో ఆశ్చర్యాన్ని కలిస్తాయ్.. సీరియస్ విషయాలే అయినప్పటికీ అవి జరిగిన తీరును చూస్తే నవ్వులు విరబూస్తాయ్.. అలాంటి సంఘటకు సంబంధించినదే ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. అది చూసిన వారంతా ‘ఏంది భయ్యా ఇది..! అదృష్టమంటే నీదే పో..’ అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటనే కదా మీ డౌట్? ఏం లేదు ఓ యువకుడు ఒకే రోజు రెండు వివాహాలు చేసుకున్నారు.

యూపీలోని గోరక్‌పూ‌ర్ జిల్లా, హర్పూర్ బుధాట్ గ్రామానికి చెందిన యువకుడు నాలుగేళ్లుగా తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. కాగా గతంలో వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని, కాపురం కూడా పెట్టారు. విషయం తెలియని అబ్బాయి తల్లిదండ్రులు అతనికి మరో సంబంధం ఖాయం చేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచేసరికి ఆ యువకుడు తన రహస్య ప్రేమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలనుకున్నాడు. ఓ రోజు ఉదయం తన ప్రియురాలిని కోర్ట్ మ్యారేజ్ చేసుకుని తాము సపరేట్‌గా ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత ఈ వివాహాన్ని తన కుటుంబం ఆమోదిస్తుందని ఆశించాడు. కానీ బెడిసి కొట్టింది.

అసలు విషయం తెలుసుకున్న యువకుడి పేరెంట్స్ అతని రహస్య వివాహానికి ఓకే చెప్పలేదు. పైగా అదే రోజు రాత్రికి ఆ యువకుడి కుటుంబం, తాము ఎంపిక చేసిన యువతితో వివాహానికి ఏర్పాట్లు చేసింది. దీంతో అతను రాత్రి బారాత్‌తో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం మొదట కోర్ట్ వివాహం చేసుకున్న యువతికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ యువకుడి ఇంటికి రాగా.. అసలు విషయం బయట పడింది. ఇప్పటికే తనను పెళ్లి చేసుకున్న అతడు, మరో వివాహం కూడా చేసుకున్నాడని తెలిసి షాక్ తిన్నది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘ఒక వరుడు, ఇద్దరు వధువులు’ క్యాప్షన్‌తో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం ఏం లక్కీ బ్రో నీది..! అంటూ సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు.

Read More..

స్ట్రెస్.. ఫాదర్స్ గిఫ్ట్.. స్పెర్మ్ కణాలలో శాశ్వత జీవరసాయన గుర్తులు

ఇదెక్కడి రోత.. ప్రైవేట్‌ పార్ట్‌ను పట్టుకోని యాడ్‌ చేశారు.. ప్రజలేమో దాన్ని పట్టుకుంటున్నారు

Next Story