- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Holi 2025: బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా?.. ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేస్కోకండి!
Holi 2025: భారతదేశంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో(Holi Color) మునిగి తేలే పండగనే హోలీ(Holi 2025).

దిశ, వెబ్‌డెస్క్: Holi 2025: భారతదేశంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో(Holi Color) మునిగి తేలే పండగనే హోలీ(Holi 2025). ఈ రంగుల వేడుకలను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఈ హోలీ పండగ(Holi 2025) వస్తుంది. ఈ ఏడాది 2025లో మార్చి నెలలో 14వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. ఈ రంగుల పండగను హిందువులతోపాటు ఇతర మతాల వారు కూడా జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలో తడిచి ముద్దవుతారు. ఈ పండగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది హోలీ పండగ ఆనవాయితీగా వస్తోంది. హోలీ(Holi 2025) అంటే అగ్నికి సంబంధించింది. అందుకే దీన్ని హోలీకా పూర్ణిమా అని అంటారు.
ఇక హోలీ(Holi 2025) పండగా అనగానే రంగులు(Holi Color) గుర్తుకు వస్తాయి. ఇంద్రదనుస్సులోని రంగులన్నీ ఈ రోజు కనిపిస్తాయి. ఎరుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ, పసుపు పచ్చ, కాషాయం రంగులన్నీ మనస్సును ఉల్లాసపరుస్తాయి. ఈ పండగను ఉత్తరభారతంలో ఎక్కువగా జరుపుకుంటారు. రంగులు చల్లుకోవడంతోపాటు చల్లని పానీయాలు కూడా సేవిస్తుంటారు. రుచికరమైన స్వీట్లు ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నేపథ్యంలో అందరికీ ఒకేరకమైన రంగులు కాకుండా వాటి అర్థాలు తెలుసుకోని వాడుకోవాలట. హోలీ పండగ(Holi 2025) రోజు ఉపయోగించే రంగుల(Holi Color) వెనుక ప్రత్యేక ఉద్దేశ్యం ఉందట. రంగుల అర్థాలను తెలుసుకుని ఎవరి మీద ఏ రంగు చల్లాలో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి.
ఆకుపచ్చ రంగు:
ఆకుపచ్చ రంగు శాంతి, మనశ్శాంతిని సూచిస్తుంది. కొత్త రిలేషన్ ప్రారంభించాలనుకునేవారు గతంలో మనస్పర్థలు వచ్చిన వ్యక్తిని మళ్లీ కలుసుకోవాలంటే ఈ ఆకుపచ్చ రంగులు చల్లుకోవాలట.
ఎరుపు రంగు:
ఎరుపు రంగు బలం, బంధం, ప్రేమ వివాహ బంధాన్ని, సంతానోత్పత్తిని సూచిస్తుందని నమ్ముతుంటారు. హోలీ రోజు మీ జీవిత భాగస్వామికి ఎరుపు రంగు చల్లండి. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి.
నీలి రంగు:
నీలిరంగు ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది. ఆత్మ పరిశీలన, ప్రశాంతత, బలమైన మనోధైర్యాన్ని సూచించే ఈ రంగును మీ సహోద్యోగులు, స్నేహితులపై చల్లడం మంచిదట.
కాషాయ రంగు:
ఈ రంగు కొత్త జీవితం ప్రారంభించాలనుకునేవారు, బ్రేకప్ చెప్పిన వారు, క్షమించాలని కోరుకునే వారు ఉపయోగించాలట.
గులాబీ రంగు:
హోలీ అనగానే గులాబీ రంగు గుర్తుకు వస్తుంది. ఈ రంగుకు అత్యంత ప్రజాదరణ ఉంది. ఈ రంగు ప్రేమ, స్నేహం, విశ్వాసాన్ని సూచిస్తుంది. బంధువులు, స్నేహితులపై గులాబీ రంగును చల్లడం ద్వారా మీ స్నేహబంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.
పసుపు రంగు:
పసుపు అంటే శుభానికి సూచిక. శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది. మీ గురువులు, ఉపాధ్యాయులు, పెద్దవారిపై అత్యంత నమ్మకమైన మిత్రులపై పసుపు రంగు చల్లడం శుభప్రదం.
Read More..






