- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా
అనారోగ్య కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ తన పదవిని వదులుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. 76 ఏళ్ల వయస్సు ఉన్న షహాబుద్దీన్, ఏప్రిల్ 2023 నుండి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2024లో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు తర్వాత ఆమె భారత్‌కు పారిపోయి వచ్చింది. దీంతో ఆమెకు మిత్రుడైన మహమ్మద్ షహాబుద్దీన్ పదవిని చేపట్టారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు ఆటోనామిక్ న్యూరోపతీ అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈ వ్యాధి కారణంగా తాను అప్పుడప్పుడు కొద్దిసేపు స్పృహ కోల్పోతున్నానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు జాతీయ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు. కాగా.. కొన్ని నెలల తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ ఆమె వెళ్లే సమయానికి ఉన్నత పదవుల్లో ఆమెకు మిత్రులెవరూ లేకుండా పోయారు. 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది జైలుపాలయ్యారు. కొంత మంది అజ్ఞాతంలోకి వెళ్లాపోయారు.






