- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంమంత్రి అనిత 'X' అకౌంట్ హ్యాక్
by Muthe.Rajitha |
ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత అధికారిక 'X' ఖాతా హ్యాకర్స్ బారిన పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత అధికారిక X (ట్విట్టర్) ఖాతా హ్యాకర్స్ బారిన పడింది. ఈ శుక్రవారం ఆమె ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు, దానిని దుర్వినియోగం చేస్తూ కొన్ని అనుమానాస్పద పోస్టులు పెట్టారు. అకౌంట్ లో FXRP పేరుతో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక స్కామ్ లింక్‌ను పిన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే అకౌంటులోని పోస్టులు, డీపీ ఏవీ కనబడటం లేదు. కాగా తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని గుర్తించిన హోమ్ మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి హ్యాకర్లను పట్టుకోవాలని కోరుతూ ఆమె అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి చర్యలు చేపట్టారు.
Next Story






