- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ఎన్ఆర్ఐ - NRI > పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు సహా 15 మంది మృతి
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు సహా 15 మంది మృతి
by I. Sairam |
పాకిస్తాన్ లో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. ఇందులో 12 మంది సైనికులు ఉన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో తాలిబన్లు జరిపిన ఘోర ఆత్మాహుతి దాడిలో 12 మంది జవాన్లు సహా 15 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ట్యాంక్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాంబులతో కూడిన ఓ వాహనం భద్రతా చెక్‌పోస్ట్‌ను ఢీకొట్టడంతో ఒక సారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సైన్యానికి చెందిన 12 మంది, ఇద్దరు పోలీసులు, అటవీ శాఖకు చెందిన ఓ అధికారి చనిపోయారని సైన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడికి తాము ప్రతీకారంగా ఎదురుదాడి చేసి 12 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. కాగా.. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ అనే తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని పేర్కొంది.
Next Story






