- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బ్లాక్ సీ'లో నౌకపై దాడి.. భారతీయుడు మృతి
'బ్లాక్ సీ'లో ప్రయాణిస్తున్న 'ఎంవీ ఒమోర్ఫీ' (MV Omorfi) అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, వెబ్ డెస్క్ : 'బ్లాక్ సీ'లో ప్రయాణిస్తున్న 'ఎంవీ ఒమోర్ఫీ' (MV Omorfi) అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. జులై 18న రష్యా ప్రాదేశిక జలాల గుండా ఈ నౌక ప్రయాణిస్తున్నపుడు ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించగా, అదృష్టవశాత్తూ మిగిలిన ఇద్దరు భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాగే రష్యాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి సంబంధిత స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడి దేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.






