Leviathan : లెవియాథాన్ ఇంకా బతికే ఉందా .. సముద్రానికే వణుకుపుట్టించే ఈ పాము బయటికొస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందా?

by Phanindra |   (  Updated:2025-03-13 04:22:43  IST  )

"లెవియాథాన్ " ( Leviathan ) అనే ఈ భయంకర పాము గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రస్తావించారు.

Leviathan : లెవియాథాన్ ఇంకా బతికే ఉందా .. సముద్రానికే వణుకుపుట్టించే ఈ పాము బయటికొస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచమంతా ఎన్నో వింతలు జరుగుతున్నాయనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని చూస్తుంటే .. యుగాంతం తప్పకుండా వస్తుందని చెబుతున్నాయి. సముద్రానికి అడుగు భాగంలో నివసించే ఓర్స్ ఫిష్ మెక్సికోలో బయటికి రావడం, వేల చేపలు ఒడ్డుకు కొట్టుకురావడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటితో పాటు, లెవియాథాన్ పాము ఇంకా బతికే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 800 కిలోమీటర్లు ఉండే ఈ పాము బయటకొస్తే ప్రపంచ అల్లకల్లోలమవ్వడం పక్కా అని అంటున్నారు.

"లెవియాథాన్ " ( లేవియతాన్ ) అనే ఈ భయంకర పాము గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రస్తావించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా ఉంటుందని చెప్పబడింది. అయితే 800 కిలోమీటర్లు కంటే ఇంకా పెద్దదిగా ఉంటుందని చెబుతుంటారు. కొన్ని అధ్యయనాలు దీని గురించి ఏం చెబుతున్నాయంటే .. ఇది సముద్రంలో నివసించే అన్ని జీవుల్లో శక్తివంతమైన జీవిగా చెప్పారు. సైజులో పెద్దదిగా ఉండటం వలన దీని కవచాలు ఇనుమును పోలి ఉంటాయని, దాని పళ్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పాము ఒక్కసారి గట్టిగా గర్జించినప్పుడు, సముద్రానికి కూడా వణుకు పుట్టించి ఓ ఊపు ఊపేస్తుందని, నోటి నుంచి పెద్ద పెద్ద మంటలు వెలువడతాయని చెబుతున్నాయి. అంతటి శక్తి వంతమైన జీవి తలచుకుంటే ప్రళయం సంభవించేలా చేయగలదని అంటున్నారు.

సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ పాముకు సంబంధించిన ఎన్నో కథలు వచ్చాయి. మెసపోటామియన్స్, క్రిస్టియన్లు వంటి పలు మతాల ప్రజలు లెవియాథాన్‌ను గురించి మాట్లాడుకునేవారు. గత కొన్ని నెలల నుంచి ప్రపంచంలో జరుగుతున్న వింతలు చూసి ఈ పాము ఇంకా బతికే ఉందని, అందువలనే సముద్రం నుంచి జీవులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కొందరు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పామును బయటకి వస్తే భూకంపం, ప్రళయం వచ్చి మొత్తం నాశనమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవులు చేసే తప్పులు ఎక్కువై , ప్రపంచం మొత్తం అధర్మం మార్గంలో నడిస్తే , ఈ లెవియాథాన్ పాము కచ్చితంగా బయట వస్తుందని విశ్వసిస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.


Read More..

ది బెస్ట్ హస్బెండ్‌లా ఉంటానని అభిమాని మెసేజ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

Next Story