పాముతో పరిగాశం ఆడితే ఇలానే జరుగుద్ది.. వైరల్ వీడియో

by Malleboina Mahesh |   (  Updated:2025-03-13 12:18:15  IST  )

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి యువత అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ఇందులో కొందరు తమ టాలెంట్ చూపించి ఫాలోవర్స్ పెంటుకుంటుంటే మరికొందరు వింత పనులు చేసి.. లైకులు, షేర్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాముతో పరిగాశం ఆడితే ఇలానే జరుగుద్ది.. వైరల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ (famous) అవ్వడానికి యువత అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ఇందులో కొందరు తమ టాలెంట్ చూపించి ఫాలోవర్స్ (Followers) పెంటుకుంటుంటే మరికొందరు వింత పనులు చేసి.. లైకులు, షేర్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు పాముతో పరాచకాలు ఆడుతూ.. తమను తాము రిస్క్ లోకి నెట్టుకుంటున్నారు. ఇలా.. పామును ముద్దు (పామును ముద్దు) పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ యువతికి ఎదురైన అనూహ్య ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ఓ యువతి.. కొండచిలువ పామును తన చేతిలోకి తీసుకొని.. దానికి ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది.

దీంతో ఆ కొండచిలువ (Python) వెంటనే ఆమె రెండు పెదాలను గట్టిగా కొరికింది. ఈ క్రమంలో బయానికి గురైన ఆ యువతి పామును కిందపడేసి అక్కడి నుంచి పరుగు తీయడం ఆ వీడియోలు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ వీడియో వైరల్ (video went viral) గా మారడంతో.. నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్.. పాములతో పరగాశం అడితే ఇలానే అవుద్దని కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ.. పాములు ఎప్పటికీ ప్రమాదమే పాములతో గేమ్స్ (Games with snakes) వద్దని రాసుకొచ్చాడు. మరో నెటిజన్.. ఇది ముమ్మాటికి ఆకస్మిక చర్య.. ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని రాసుకొచ్చాడు.

Next Story