వేసవి వేళ కుండలోని పెరుగు తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?

by Disha Web Desk 9 |
వేసవి వేళ కుండలోని పెరుగు తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అందరి ఇండ్లలో పెరుగు ఉంటుంది. పెరుగన్నం తిననిది భోజనం కంప్లీట్ కాదని చాలా మంది భావిస్తారు. కాగా ప్రస్తుత రోజుల్లో అధిక శాతం మంది ప్లాస్టిక్, స్టీల్ గిన్నెలు, గ్లాసులో తోడు వేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మట్టి కుండలో తోడు పెట్టేవారు. ఆ విధంగా తయారు చేసిన పెరుగు ఎంతో రుచికరంగా ఉండేది. మట్టి కుండలో తోడు పెట్టిన పెరుగు టెస్టీగానే కాకుండా ప్రొబయోటిక్స్ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

* మట్టికుండలో తయారు చేసిన పెరుగులో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణక్రియను, ఇమ్యూనిటీ పవర్‌ను మెరుగుపరచడంలో ఎంతగానో మేలు చేస్తాయి.

* మట్టిలో ఉండే పోరస్ స్వభావం కుండ లోపల ఉండే గాలిని ప్రసరించడానికి అనుకూలంగా ఉంటుంది.

* అలాగే పెరుగులో ఉండే అదనపు నీరును కుండ పీల్చుకుంటుంది. పెరుగు మరింత గట్టిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది.

* మట్టి పాత్రలోని పెరుగులో కాల్షియం, మెగ్నిషియం, ఖనిజ లవణాలు ఉంటాయి. పెరుగులో ఖనిజ లవణాలు చేరడంతో పాటు పోషకాలు అందిస్తాయి.

* పెరుగుకు మట్టి లాంటి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మరేగిన్నెలో తోడు పెట్టినా ఇలాంటి ఫ్లేవర్ ఉండదు.

* మట్టికుండలో తయారు చేసిన కర్డ్‌లో ఉండే ఆల్కలీన్ సబ్‌స్టిట్యూట్స్ యాడ్ అయి, పెరుగులో ఆమ్లతను బ్యాలెన్స్ చేస్తాయి.

Read more: Beer: ఎర్రటి ఎండలో చల్లటి బీర్ తాగేవారు.. వీటిని అస్సలు తీసుకోకూడదు?

చక్కెరను అధికంగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవట!



Next Story

Most Viewed