చక్కెరను అధికంగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవట!
షుగర్‌తో తయారు చేసిన ఏ ఫుడ్ అయినా ఎంతో టెస్టీగా ఉంటుంది.
అందువల్ల తీపిని ఎక్కువ మంది చాలా ఇష్టపడుతారు.
కానీ చక్కెర మన ఆరోగ్యానికీ ఎన్నో రకాల వ్యాధులను తెచ్చి పెడుతుంది.
కొంతమంది షుగర్‌ను మోతాదుకు మించి అధికంగా తింటుంటారు.
కానీ చక్కెరతో తయారు చేసిన సోడా, స్వీట్లు, కాల్చిన ఆహారాలు, రుచికరమైన స్నాక్స్‌తో పాటు ప్రాసెస్ చేసిన అనేక రకాల ఆహారాలు అస్సలు తినకూడదు.
షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడతారో చూద్దాం.
చక్కెరలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. లిమిట్స్‌కు మించి తింటే తప్పకుండా బరువు పెరుగుతారు.
షుగర్ తీసుకోవడం వల్ల తొందరగా ఎనర్జీ వస్తుంది. కానీ అదనపు శక్తి, శరీరంలో కొవ్వు నిల్వ ఉంటుంది.
అలాగే దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, స్వయం ప్రతిరక్షక రుగ్మతలతో పాటు అనేక వ్యాధులను కలిగిస్తుంది.
షుగర్ దంతాల ఎనామెల్‌ను నాశనం చేసే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కావిటీస్‌కు కూడా కారణం అవుతుంది.
చక్కెర మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మెదడు పనితీరును బలహీనపరుస్తుంది. అలాగే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.