మధుమేహం తీవ్రమైతే డయాబెటిక్ నెఫ్రోపతి..ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్!

by Javid Pasha |   (  Updated:2025-12-26 06:38:22  IST  )

కిడ్నీ సమస్యలతో ఆరోగ్యానికి ముప్పు సంభవిస్తున్నప్పుడు ప్రధానంగా మూత్రంలో ప్రోటీన్లు, వ్యర్థపదార్థాలు పేరుకుపోవడం, తీవ్రమైన అలసట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

మధుమేహం తీవ్రమైతే డయాబెటిక్ నెఫ్రోపతి..ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. అయితే షుగర్ పేషెంట్లలో కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తే ప్రమాదకరమైన పరిస్థితినే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారని వైద్య నిపుణులు చెబున్నారు. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువ కావడంవల్ల రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో కిడ్నీలకు ఇబ్బందిగా మారుతుంది. వ్యక్తి బాడీ నుంచి వ్యర్థ పదార్థాలను, అవసరం లేని అదనపు ద్రవాలను తొలగిండంలో సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు, సామర్థ్యం మందగిస్తుంది. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్స్‌కు దారితీయవచ్చు. కిడ్నీలలో చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. వీటినే నెఫ్రాన్లు అంటారు. డయాబెటిక్ పేషెంట్లలో వీటి పనితీరు సక్రమంగా ఉండదు. అంతేకాకుండా గ్లూకోజ్‌ శరీరంలోనే నిల్వ ఉండిపోతుంది. కిడ్నీలు అధికంగా రక్తాన్ని వడపోయాల్సి రావడంతో వాటి పనితీరు మందగించి నెఫ్రోపతి సమస్యకు దారితీస్తుంది.

కిడ్నీ సమస్యలతో ఆరోగ్యానికి ముప్పు సంభవిస్తున్నప్పుడు ప్రధానంగా మూత్రంలో ప్రోటీన్లు, వ్యర్థపదార్థాలు పేరుకుపోవడం, తీవ్రమైన అలసట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరం నుంచి వ్యర్థాలను, అవసరం లేని ద్రవాలను తొలగించడంలో కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయి. కాబట్టి ఈ పరిస్థితి శరీర భాగాలలో వాపునకు దారితీస్తుంది. అయితే చేతులు, పాదాలు, చీలమండల ప్రాంతంలో వాపు ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా ద్రవాలు నిల్వ కావడంవల్ల కాళ్లు, చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అల్బుమిన్ అనే ప్రోటీన్ కూడా కిడ్నీల్లో పేరుకుపోతుంది. డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఈ సమస్య ఏర్పడుతుంది. యూరినల్ టెస్ట్ ద్వారా దీనిని గుర్తించవచ్చు. డయాబెటిస్ పేషెంట్‌ అయిన వ్యక్తిలో మూత్రంలో ఈ ప్రొటీన్ ఉన్నట్లు గుర్తిస్తే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని భావించవచ్చు. వీటితోపాటు శరీరంపై దురద, దద్దుర్లు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఎముకల మజ్జలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఎరిథ్రోపోయిటిన్‌ను కిడ్నీలు ప్రొడ్యూస్‌ చేస్తాయి. డయాబెటిక్ నెఫ్రోపతివల్ల ఈ ప్రక్రియ ఆగిపోతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Related News : మానవ శరీరంలో ‘రెండవ గుండె’! దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.

చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?

Next Story