- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయాబెటిక్ నెఫ్రోపతి.. షుగర్ పేషెంట్లలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు
డయాబెటిస్ పేషెంట్లకు కిడ్నీ ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి

దిశ, ఫీచర్స్: డయాబెటిస్ పేషెంట్లకు కిడ్నీ ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఈ సమస్య ఏర్పడిందని లక్షణాలను బట్టి కూడా గుర్తించవచ్చు. షుగర్ పేషెంట్లలో కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తే ప్రమాదకరమైన పరిస్థితినే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువ కావడంవల్ల కిడ్నీలకు ఫిల్టర్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. వ్యక్తి బాడీ నుంచి వ్యర్థ పదార్థాలను, అవసరం లేని అదనపు ద్రవాలను తొలగిండంలో సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు, సామర్థ్యం మందగిస్తుంది. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్స్‌కు దారితీయవచ్చు. కిడ్నీలలో చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. వీటినే నెఫ్రాన్లు అంటారు. డయాబెటిక్ పేషెంట్లలో వీటి పనితీరు సక్రమంగా ఉండదు. అంతేగాక గ్లూకోజ్ శరీరంలోనే నిల్వ ఉండిపోతుంది. కిడ్నీలు అధికంగా రక్తాన్ని వడపోయాల్సి రావడంతో వాటి పనితీరు మందగించి నెఫ్రోపతి సమస్యకు దారితీస్తుంది.
లక్షణాలు
కిడ్నీ సమస్యల ముప్పు సంభవిస్తున్నప్పుడు వ్యక్తులో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ప్రారంభంలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి లక్షణాలలో కాళ్లు, చేతులు వాయడం ఒకటి. సాధారణంగా, శరీరం నుంచి ఎక్స్‌ట్రా వ్యర్థాలను, ద్రవాలను తొలగించడంలో కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు శరీర భాగాలలో వాపునకు దారితీస్తుంది. అయితే చేతులు, పాదాలు, చీలమండల ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా ద్రవాలు నిల్వ కావడంవల్ల కాళ్లు, చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రోటీనురియా
మూత్రంలో అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. అల్బుమిన్ కూడా ఒక రకమైన ప్రొటీన్. ఇది డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో మూత్రంలో కనిపిస్తుంది. యూరినల్ టెస్ట్ ద్వారా దీనిని గుర్తించవచ్చు. డయాబెటిస్ పేషెంట్ అయిన వ్యక్తిలో మూత్రంలో ఈ ప్రొటీన్ ఉన్నట్లు గుర్తిస్తే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని భావించవచ్చు.
రక్తంలో వ్యర్థపదార్థాలు
కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో తరచూ చర్మం పొడిబారడం, ఎర్రటి మచ్చలు ఏర్పడటం, దురద వంటి లక్షణాలు కనిపించవచ్చు. విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు రక్తప్రవాహంలో పేరుకుపోవడంవల్ల ఇలా జరుగుతుంది. అలాగే సదరు వ్యక్తుల్లో ఆకలి మందగిస్తుంది. రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంవల్ల వికారం, వాంతులు సంభవిస్తాయి. క్రమంగా బరువు తగ్గుతారు.
తీవ్రమైన అలసట
డయాబెటిక్ నెఫ్రోపతి ప్రాబ్లం ఉన్నవారు తరచుగా అలసిపోతుంటారు. ఒక్కోసారి అలసట తీవ్రంగా ఉంటుంది. నీరసం, నిస్సత్తువ వెంటాడుతుంటాయి. రక్తహీనత ఏర్పడుతుంది. ఇటువంటి కండీషన్‌లో ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఎరిథ్రోపోయిటిన్‌ను కిడ్నీలు ప్రొడ్యూస్ చేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది.
ఇవి కూడా చదవండి: రీ జనరేటివ్ మెడిసిన్.. డ్యామేజ్డ్ ఆర్గాన్స్ రిపేర్ చేయడానికి న్యూ టెక్ ఎయిడెడ్ సొల్యూషన్






