రీ జనరేటివ్ మెడిసిన్.. డ్యామేజ్డ్ ఆర్గాన్స్ రిపేర్ చేయడానికి న్యూ టెక్ ఎయిడెడ్ సొల్యూషన్

by Phanindra |   (  Updated:2023-04-09 08:53:57  IST  )

కొందరికి పుట్టకతో అంగవైకల్యం ఉండవచ్చు

రీ జనరేటివ్ మెడిసిన్.. డ్యామేజ్డ్ ఆర్గాన్స్ రిపేర్ చేయడానికి న్యూ టెక్ ఎయిడెడ్ సొల్యూషన్
X

దిశ, ఫీచర్స్: కొందరికి పుట్టకతో అంగవైకల్యం ఉండవచ్చు. మరి కొందరికి ప్రమాదాలవల్ల కాలో, చెయ్యో ఇతర అవయవాలో డ్యామేజ్ కావచ్చు. ఇటువంటి పరిస్థితి వ్యక్తులను తీవ్రంగా కలచి వేస్తుంది. ఏదైనా కారణంగా శరీరంలోని ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే ఆ ఎఫెక్ట్ మొత్తం జీవితంపై పడుతుంది. కానీ ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చాక అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కూడా ఏర్పడింది. డ్యామేజ్డ్ ఆర్గాన్స్‌ను కృత్రిమ అవయవాలతో ప్రస్తుతానికి కొంత వరకు పునరుద్ధరించగలుగుతున్నారు. అయితే రీజనరేటివ్ మెడిసిన్(డ్యామేజ్డ్ ఆర్గాన్స్ రిపేర్ చేయడానికి న్యూ టెక్ ఎయిడెడ్ సొల్యూషన్ )వల్ల భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా బయో-ప్రోస్తేటిక్ అవయవాలు( bio-prosthetic limbs) రోగులు కోల్పోయిన ఆర్గాన్స్‌ ఫంక్షనాలిటీని పునరుద్ధరించడంలో సహాయపడతాయని ముంబై జస్లోక్ హాస్పిటల్‌లో రీజనరేటివ్ అండ్ రిస్టోరేటివ్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పరేష్ దోషి అంటున్నారు.

దీర్ఘకాలిక ప్రభావాలకు చెక్

మానవ శరీరం తనకు తానుగా స్వస్థత పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మనకు తెలుసు. కానీ ఇప్పుడు టెక్నాలజీ కారణంగా డాక్టర్లు ఈ బయో మెకానిజాన్ని కూడా గ్రహించగలిగారు. ఇది పునరుద్ధరణ, పునరుత్పత్తి ఔషధాలను అభివృద్ధి చేయడంలో పరిశోధకులకు సహాయపడింది. దీంతో డాక్టర్లు స్ట్రోక్, డయాబెటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా తలెత్తే దీర్ఘకాలిక ఇబ్బందుల ప్రభావాన్ని నియంత్రించడానికి వీలు కలుగుతుంది. రీజనరేటివ్ మెడిసిన్ ఆధారంగా శరీరంలోని ఏ అవయవాలు, కణజాలాలు అయినా పునరుద్ధరించబడతాయి. లేదా రిపేర్ చేయబడతాయి. ట్రీట్మెంట్ ద్వారా అవి మునుపటిలాగా పనిచేస్తాయి.

థెరపీల ద్వారా పునరుద్ధరణ

అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ బ్లడ్ అండ్ బయోథెరపీస్ ప్రకారం.. రీజనరేటివ్ మెడిసిన్ చికిత్సలో భాగంగా “సెల్ థెరపీస్ (ఇందులో మూలకణాలు లేదా పుట్టుకతో వచ్చే కణాల ఇంజెక్షన్ ఉంటుంది), ఇమ్యునోమోడ్యులేషన్ థెరపీ, కణజాల ఇంజనీరింగ్(ప్రయోగశాలలో పెరిగిన అవయవాలు, కణజాలాల మార్పిడి) ద్వారా అవయవాలు ఎఫెక్టివ్‌గా పనిచేయగలుగుతాయి. తాజాగా ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ రీజెనరేటివ్, రిస్టోరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ప్రారంభించింది. “రీజనరేటివ్ అనే పేరులో ఉన్నట్లుగానే రీస్టోరేటివ్ మెడిసిన్ శరీర పనితీరును పునరుద్ధరిస్తుది. ఇది అనేక పద్ధతుల ద్వారా చేయవచ్చు. అవయవాల క్షీణత ఉన్న రోగులలో శరీర పనితీరును పునరుద్ధరించడానికి మేం ఆధునిక అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తాం. అల్జీమర్స్, పోస్ట్-స్ట్రోక్ సిండ్రోమ్, స్లర్రి స్పీచ్ లేదా పారాప్లేజియా వెన్నెముక గాయం వంటి అనేక వ్యాధుల విషయంలోనూ ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది’’ అంటున్నారు జస్లోక్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పరేష్ దోషి. అంతేకాదు డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్, క్రానిక్ పెయిన్, పోస్ట్-స్ట్రోక్ పక్షవాతం, మెమరీ డిస్ఫంక్షన్ లేదా పార్కిన్సన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా చికిత్స చేయవచ్చు. రాబోయే పదేళ్లలో అన్ని రకాల అవయవాలను పునర్ధురించగలిగే రీ జనరేటివ్ సొల్యూషన్ ట్రీట్‌మెంట్ భారతదేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి.. షుగర్ పేషెంట్లలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు

Next Story