టిప్స్ కోసం యువతి కాళ్లను ఫొటో తీసిన డెలివరీ బాయ్.. ఆ పిక్‌తో రూ.వేల సంపాదించిన లేడీ

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-04-18 14:25:42  IST  )

ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్ చేసిన పనికి ఓ మహిళ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టిప్స్ కోసం యువతి కాళ్లను ఫొటో తీసిన డెలివరీ బాయ్.. ఆ పిక్‌తో రూ.వేల సంపాదించిన లేడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సంపాదనను పెంచుకోవడానికి ప్రజలు రకరకాల దారులను వెతుకుతున్నారు. ముఖ్యంగా గిగ్ ఎకానమీలో (Gig Economy) పనిచేసే డెలివరీ డ్రైవర్లు అదనపు 'టిప్స్' కోసం చేసే కొన్ని ప్రయత్నాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని, మరికొన్ని సార్లు వివాదాలకు దారితీస్తుంది. తాజాగా ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్ చేసిన పనికి ఓ మహిళ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది?

సాధారణంగా డెలివరీ బాయ్స్ ఆహారం డెలివరీ చేసిన తర్వాత సాక్ష్యం కోసం ఫొటో తీస్తుంటారు. అయితే, ఈ వైరల్ క్లిప్ ప్రకారం.. ఒక డెలివరీ బాయ్ తన ఆదాయాన్ని (Tips) పెంచుకోవాలనే ఉద్దేశంతో, డెలివరీ ప్యాకెట్‌తో పాటు ఆర్డర్ ఇచ్చిన మహిళ పాదాలను (Feet) కూడా ఫొటో చేసే ప్రయత్నం చేశాడు. ఆన్‌లైన్‌లో 'ఫీట్ పిక్స్' (Feet Pics) కు ఉన్న క్రేజ్‌ను ఈ ఫొటోతో క్యాష్ చేసుకోవాలనేది అతని ఉద్దేశమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని చూసి సదరు మహిళ కంగారు పడకుండా లేదా అసహనం వ్యక్తం చేయకుండా చాలా తెలివిగా వ్యవహరించింది. ఆ డ్రైవర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆమె, ఆ క్షణాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది. తన గోప్యతకు భంగం వాటిల్లుతుందని భయపడకుండా, ఆ ఫోటో షూట్‌కు సహకరించినట్లుగా కనిపిస్తూనే, ఆ సందర్భాన్ని సోషల్ మీడియాలో కంటెంట్‌గా మలిచింది. ఆ ఫొటోను పోస్ట్ చేయడంతో దాదాపు రూ.6,082 ($65.68) వచ్చినట్లు స్పష్టమవుతోంది.

అయితే ఈ సంఘటనపై ఇంటర్నెట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఏదైనా దానిని సంపాదనగా మార్చుకోవడం ఆమె తెలివితేటలకు నిదర్శనం అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం డెలివరీ డ్రైవర్ల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల అనుమతి లేకుండా ఇలాంటి ఫొటోలు తీయడం గోప్యత ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ సంఘటన నేటి గిగ్ ఎకానమీలో ఉన్న ఒత్తిళ్లను, ప్రజలు ఆదాయం కోసం ఎంతటి వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారో అద్దం పడుతోంది.

Read More.. తరాల మధ్య అంతరాలు చెరిపే అద్భుతం.. కాల్ ఏ బూమర్

Next Story