- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mother Teresa: మదర్ థెరిసా చీకటి కోణం.. ఆవిష్కరించిన డాక్యుమెంటరీ
దిశ, ఫీచర్స్ : 'మదర్ థెరిసా'.. పరిచయం అవసరం లేని పేరు. పరదేశం నుంచి ఇండియాకు వచ్చిన ఆ ప్రేమమూర్తి.. ఇక్కడ ఎందరో The Dark Side Of Mother Teresa

The Dark Side Of Mother Teresa
దిశ, ఫీచర్స్ : 'మదర్ థెరిసా(Mother Teresa)'.. పరిచయం అవసరం లేని పేరు. పరదేశం నుంచి ఇండియాకు వచ్చిన ఆ ప్రేమమూర్తి.. ఇక్కడ ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుంది. కోల్‌కతా మురికివాడల్లోని పేదల సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. నోబెల్ గ్రహీత అయిన ఈ క్రైస్తవ సన్యాసిని.. మానవత్వం, దయాగుణం, శాంతి, సహాయానికి మారుపేరు. అయితే థెరిసా పై రూపొందించిన కొత్త డాక్యుమెంటరీ.. తన చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. సన్యాసినుల డార్క్ యాంగిల్ గురించి బయటపెట్టింది.
మాతృ మూర్తి గా మన్ననలు అందుకున్న మదర్ థెరిసా .. యుద్ధాలను అంతం చేయగలిగింది.. అధ్యక్షులతో స్నేహం చేయగలిగింది.. ప్రపంచవ్యాప్తంగా అనాథలకు అండగా నిలిచింది.. అనారోగ్యంతో ఉన్న ఖైదీలను జైలు నుంచి విడుదల చేయగలిగింది. కానీ కాథలిక్ చర్చి కి సంబంధించిన వివాదాస్పద అంశాలను కప్పిపుచ్చి.. తన చరిత్రకు మచ్చ తెచ్చుకుందనేది సరికొత్త అంశం. ప్రజల కోసం అన్ని సౌకర్యాలతో కూడా ఆస్పత్రిని నడిపించేంత డబ్బు, సామర్థ్యమున్న.. చికిత్సలతో కాకుండా ప్రార్థనలతో సరిపెట్టింది. ఈ చర్యలు ప్రజలను సమస్యల నుండి బయట పడేయడం కన్నా వారిని మరింత పేదరికంలో నెట్టినట్లుగా డైలీ మెయిల్ నివేదించింది.
'మదర్ థెరిసా : ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్' పేరుతో తీసిన మూడు-భాగాల స్కై డాక్యుమెంటరీ సిరీస్.. ఆమె సన్నిహిత మిత్రులు, విరోధుల గురించి చర్చిస్తుంది. అంతేకాదు శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ మహిళల్లో ఒకరైన మదర్ థెరిసాను మరో కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. ఇక 20 ఏళ్ల పాటు థెరిసా తో కలిసి పనిచేసిన మేరీ జాన్సన్.. 'ఆమె ఆధ్యాత్మికత శిలువపై జీసస్‌తో ముడిపడి ఉంది' అని చెప్పడం విశేషం. యేసు పేదవాడు కాబట్టి ప్రజలు కూడా పేదవాళ్లు కావడం మంచిదని ఆమె భావించేదని, ఇది స్కిజోఫ్రెనిక్(మెంటల్ డిజార్డర్) అని మేరీ జాన్సన్ తన నివేదికలో పేర్కొంది.
రెవరెండ్ డొనాల్డ్ మెక్‌గ్యురే దుర్వినియోగానికి పాల్పడినట్లు అనుమానించబడిన తర్వాత.. ప్రీస్ట్‌ల వద్ద పెరుగుతున్న చిల్డ్రన్ అబ్యూస్‌కు సంబంధించిన కుంభకోణంపై ఆమె వైఖరి వివాదాస్పదమైంది. అతనిపై తనకున్న విశ్వాసం, నమ్మకాన్ని ఎత్తిచూపుతూ థెరిసా అధికారులకు ఒక లేఖ రాసింది. ఇది మెక్‌గ్యురే వందలాది మంది అబ్బాయిలను మరోసారి హింసించేందుకు అనుమతించింది. మరీ ముఖ్యంగా మదర్ థెరిసా చివరి దశాబ్దం బహుశా ఆమెకు అత్యంత సవాల్‌గా ఉండేదన్న మేరీ.. చైల్డ్ అబ్యూసింగ్ స్కాండల్ నుంచి ప్రీస్ట్‌లను రక్షించేందుకు చర్చికి ఆమె సహాయం అవసరం కావడంతో తనను ఈ కుంభకోణాలు వెలుగుచూసిన పట్టణాలకు పంపేవారని చెప్పింది. అక్కడి 'కథనాలను మార్చగల శక్తి ఆమెకు ఉంది' అని మేరి పేర్కొంది.
నారాయణ అరెస్టులో బిగ్ ట్విస్ట్.. గంటకో మలుపు తిరుగుతున్న కేసు






