నారాయణ అరెస్టులో బిగ్ ట్విస్ట్.. గంటకో మలుపు తిరుగుతున్న కేసు

by Kema Shiva Kumar |   (  Updated:2022-05-10 08:40:17  IST  )

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. Twist in ex minister narayana paper leakage case

నారాయణ అరెస్టులో బిగ్ ట్విస్ట్.. గంటకో మలుపు తిరుగుతున్న కేసు
X

Twist in ex minister narayana paper leakage case

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. 10 వ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్టు వెల్లడైన కొన్ని గంటలకే ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కాదని, ఏపీ రాజధాని భూముల కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్టు అధికారులు మాట మార్చడం చర్చకు దారి తీసింది. సీఆర్డీఏ విషయంలో చేతివాటం ప్రదర్శించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు, నారాయణతోపాటు మరో 12మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.


ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలిస్తుండగా తెలంగాణ సీఐడీ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అరెస్టుపై క్లారిటీ లేకపోవడంతో సరైన ఆధారాలు చూపించాలంటూ వాహనాలు నిలిపివేశారు. దీనిపై తెలంగాణ, ఏపీ సీఐడీ పోలీసుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఆయన అరెస్టును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టు చేశారన్న కొద్దిసేపటికే అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు రావడంపై టీడీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అధికార పార్టీ కుట్రలో భాగమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story