- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:సోమవతి అమావాస్య ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం
గ్రహ సంచారం, అమావాస్య ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో, అలాగే నేటి(జూన్ 15) ద్వాదశ రాశుల ఫలితాలు ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో బుధ, సూర్యుల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనితో పాటు సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి యోగాలు కూడా తోడయ్యాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ(సోమవారం) సోమవతి అమావాస్య. సోమవతి అమావాస్య వేళ శివుని ప్రత్యేక అనుగ్రహం వల్ల కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభం రాశుల వారికి అత్యంత సానుకూలమైన, అదృష్టవంతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగు రాశుల వారికి శత్రువులపై విజయం, ఆర్థిక పురోగతి లభిస్తాయి. ఇక పోతే, ఈ విశేష గ్రహ సంచారం, అమావాస్య ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో, అలాగే నేటి(జూన్ 15) ద్వాదశ రాశుల ఫలితాలు ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహానికి బంధుమిత్రుల రాకతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాల్లో మరియు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త అవసరం. శివారాధన లేదా నవగ్రహ స్తోత్ర పఠనం శుభకరం.
వృషభ రాశి
సామాజిక సేవా రంగాల్లో లేదా ప్రజా జీవితంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తుల క్రయ విక్రయాల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధువులతో కలహాలు రాకుండా మాటతీరు పై నియంత్రణ అవసరం. దక్షిణామూర్తి అష్టకం చదవడం మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం యోగం ఉంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం వల్ల శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల వాతావరణం ఉండి మీ అధికార పరిధి పెరుగుతుంది. క్షణికావేశానికి లోనవ్వకండి, కుటుంబంలో చిన్నపాటి కలతలు రాకుండా చూసుకోవాలి. శివ స్తోత్రం పఠిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి
ఉద్యోగంలో మనఃసౌఖ్యం, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆకస్మిక ధన నష్టం లేదా వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త. ఈశ్వరారాధన లేదా శివాభిషేకం చేయడం వల్ల మరిన్ని శుభాలు కలుగుతాయి.
కన్య రాశి
ఈ రాశి వారు ఇవాళ మనోబలంతో ముందుకు సాగి అనుకున్న పనులు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం కీళ్లనొప్పులు, అజీర్ణం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.
తులా రాశి
వృత్తిరీత్యా ఉన్న ఇబ్బందులను చమత్కారంతో అధిగమిస్తారు. వ్యాపారంలో సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల మరియు ఆర్ధిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కోరుకున్న అభివృద్ధి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆదాయం బాగున్నా భవిష్యత్తు కోసం సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. ఈరోజు సోమవతి అమావాస్య కారణంగా శివునికి బిల్వపత్రాలతో పూజ చేయడం ఉత్తమం.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనుకూల స్థానచలనం లేదా గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే సూచనలు ఉన్నాయి. సూర్యారాధన లేదా శివ చాలీసా పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
కుంభం
సోమవతి అమావాస్య వేళ శివుని ప్రత్యేక అనుగ్రహం ఈ రాశికి చెందిన వారిపై ఉంటుంది. ఉద్యోగంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పాత వివాదాలు లేదా కోర్టు వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
మీనం
ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు అమావాస్య కాబట్టి రావి చెట్టు మొదట్లో ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాలు, ఆర్థిక ఆటంకాలు తొలగిపోతాయి.






