ఎరువు బరువు.. వానాకాలం సాగుకు ఆదిలోనే కష్టాలు!

by Jakkula.Mamatha |

ఎరువు బరువు.. వానాకాలం సాగుకు ఆదిలోనే కష్టాలు!
X

దిశ, నందిపేట: ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదలతో మరో భారం పడుతుంది. డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు, సూక్ష్మ పోషకాలు అన్ని ఎరువుల ధరలు పెరిగాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అన్నదాతకు పెరుగుతున్న ఎరువుల ధరలు మరింత కుంగదీస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోని రెండుసార్లు ధరలు పెరగడం కర్షకులను ఆవేదనకు గురిచేస్తుంది. కాంప్లెక్స్ ధరలు ఏకంగా 50 కిలోల బస్తాకు రూ.300 నుంచి 550 వరకు పెరగడం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. యూరియా, డీఏపీ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ మిశ్రమ ఎరువుల ధరలు ఆకాశాన్నంటడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా 8.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఎరువుల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా పూర్తిస్థాయిలో వర్షాలు పడలేదు. అయినప్పటికీ ముందస్తుగా ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే పనిలో రైతన్నలు బిజీగా ఉన్నారు. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది నెలన్నర వ్యవధిలోనే రెండుసార్లు ఎరువుల ధరలు భారీగా పెరగడం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లాలో అత్యధికంగా వినియోగించే 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువు గత నెల రోజుల కిందట 50 కిలోల బస్తాకు గరిష్ట ధర రూ. 1450 ఉండేది.

ఒక్కసారిగా సీజన్ ప్రారంభంలోనే రూ.350 పెరిగింది. అంటే బస్తా ధర రూ. 1800 లకు కొన్నారు. రైతులు ఇంకా సేద్యం మొదలు పెట్టక ముందే మరో రూ. 350 పెంచారు. దుకాణాల్లోకి కొత్తగా వచ్చే సరుకు ఇప్పుడు బస్తా ధర రూ. 2150 కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే నెలన్నర రోజుల వ్యవధిలోని రూ. 600 పెరగడం కర్షకునికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంప్లెక్స్ ఎరువులు వాడే రైతులకు పెరిగిన ధరలు నడ్డి విరుస్తున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో కాంప్లెక్స్ ఎరువులు 45,122 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ రేట్ ఆఫ్ పొటాష్ 13,201 మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ధరలతో ఒక్క నిజామాబాద్ జిల్లాలోని రూ. రెండు కోట్లు అదనపు వారం పడనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక సీజన్ కు సుమారు రూ. ఐదు కోట్ల మేర రైతులు అదనంగా మిశ్రమ ఎరువులకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో అత్యధికంగా వినియోగించే పెరిగిన ఎరువుల ధరలు ఇలా ఉన్నాయి.. (రూ.లలో)


Next Story