వదంతులు నమ్మొద్దు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు: చార్మినార్ డీసీపీ

by Jakkula.Mamatha |

పాతబస్తీలోని అక్బర్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఓ చిన్న ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసినప్పటికీ, పోలీసుల తక్షణ స్పందనతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.

వదంతులు నమ్మొద్దు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు: చార్మినార్ డీసీపీ
X

దిశ, చంపాపేట్: పాతబస్తీలోని అక్బర్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఓ చిన్న ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసినప్పటికీ, పోలీసుల తక్షణ స్పందనతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పోలీసు అధికారులు వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని నియంత్రించారు. ప్రస్తుత ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీసీపీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నిర్ధారణ లేని సమాచారం, ఫోటోలు, వీడియోలు లేదా వదంతులు నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని సూచించారు. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలు సమాచారానికి వేదిక కావాలి గానీ అపోహలకు కాదు అని పేర్కొన్న ఆయన, ప్రజలు అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ప్రస్తుతం అక్బర్‌బాగ్ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story