- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో నిఫా వైరస్ కల్లోలం.. సరిహద్దుల్లో హై అలర్ట్!
కేరళ కోజికోడ్‌లో 200 మందికి పైగా నిఫా వైరస్ పాజిటివ్. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో వైద్య శాఖ హై అలర్ట్!

దిశ, వెబ్ డెస్క్: కేరళం రాష్ట్రంలో మరోసారి నిఫా వైరస్ (Nifa virus) కలకలం గా మారింది. గంటగంటకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కోజికోడ్‌లో ఈ నిఫా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. అక్కడ రెండు వందల మందికి పైగా ఈ వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కోయంబత్తూర్, తెని, కన్యాకుమారి తో పాటు కడలూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖలను తమిళనాడు ప్రభుత్వం హై అలర్ట్ చేసింది. సరిహద్దు దాటి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచడంతో పాటు, నిఫా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వారిని వెంటనే గుర్తించి మెడికల్ క్యాంపులకు తరలిస్తున్నారు. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా తమిళనాడు సర్కార్ అన్ని ముందస్తు జాగ్రత్తలు ముమ్మరం చేసింది. దీంతో కేరళం, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.






