- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టరేట్‌లో సేద తీరుతున్న శునకాలు.. పట్టించుకోని అధికారులు
by Jakkula.Mamatha |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ శునకాలకు ఆవాసంగా మారింది.

X
దిశ, కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ శునకాలకు ఆవాసంగా మారింది. ప్రతి రోజు ఏదో ఒక చోట కుక్కల దాడులతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు గాయాలపాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కుక్కల దాడులను నియంత్రించాలని, వాటిని కట్టడి చేయాలని ప్రజలు అధికారులకు విన్నపాలు చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి తమ సమస్యలు పరిష్కరించమని వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. కలెక్టరేట్‌లో గ్రామ సింహాలు హాయిగా కునుకు తీస్తున్న తీరును చూసీ ఫిర్యాదుదారులు ఔరా అనుకుంటూ భయపడుతూ పక్కకు వెళ్తున్నారు. కుక్కల దాడులను నియంత్రించమంటే ఏకంగా గ్రామ సింహాలు కలెక్టర్ కార్యాలయంలో సేదతీరడం పై ఫిర్యాదుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






