- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాపో-23’ నుంచి శ్రీనిధి శెట్టి ఔట్.. ఆ లక్కీ చాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ!
ఈ మూవీ నుంచి శ్రీనిధి శెట్టిని తొలగించి మేకర్స్ మరో హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కొద్ది కాలం నుంచి సరైన హిట్ పడటం లేదు. గత ఏడాది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంతో వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న రామ్ ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని చెప్పి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. స్వీయ దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమాను పట్టాలెక్కించనున్నారు. ‘రాపో-23’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలై.. అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో.. ఈ సినిమాకు సంబందించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ఒక మంచి హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చిత్రబృందం ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. రామ్-శ్రీనిధి కాంబో దాదాపు ఫిక్స్ అయినట్లే అని అంతా స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, సడెన్ ట్విస్ట్‌తో హీరోయిన్ మారిపోయింది. ఈ మూవీ నుంచి శ్రీనిధి శెట్టిని తొలగించి మేకర్స్ మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆమె ఈ సినిమా కోసం దాదాపు కోటిన్నర రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. శ్రీనిధి అంత పెద్ద మొత్తంలో అడగడంతో మేకర్స్ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు శ్రీనిధి శెట్టి స్థానంలో కయాదు లోహార్ పేరు పరిశీలనలోకి వచ్చింది. 'కనబడుటలేదు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ రామ్ పక్కన పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె డేట్లు కొంచెం సర్దుబాటు కావాల్సి ఉండగా.. కాయదును ఫైనల్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ కయాదు మాత్రం తెలుగులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారుతోంది. ఇప్పటికే నాని సరసన ‘ది ప్యారడైజ్’ చేస్తున్న ఈ భామకు మరో చాన్స్ రావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.






