- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవిబాబు ‘రేజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రేజర్ చిత్రం జూన్ 19 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రవిబాబు తాజాగా ‘రేజర్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం మే 8వ తేదీన విడుదలైంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది.
అందులో భాగంగా ఈ చిత్రాన్ని జూన్ 19వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో తనీష్, తేజల్ విఖ్యాతి, బెనర్జీ, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యానంద్ స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్.ఎస్. రాజేష్ సంగీతం సమకూర్చారు. రవిబాబు తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. దీనిని ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పించింది.






