- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం.. గుండా గిరికి భయపడతామా?’.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం, ఎమ్మెల్యేల గుండా గిరికి భయపడతామా అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, మంచిర్యాల: తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం, ఎమ్మెల్యేల గుండా గిరికి భయపడతామా అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గుండా గిరి బంద్ చేయాలని అన్నారు. ఈ గడ్డ నుంచే తెలంగాణ రక్షణ పార్టీ ఏర్పాటయిందని ఇక్కడ నుంచే జెండా ఎగుర వేస్తామని కవిత పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టపోతుందని ఆరోపించారు. సింగరేణి హక్కులను కాపాడేది హెచ్ఎంఎస్, టిఆర్ఎస్ మాత్రమే అన్నారు. జిఎం చేసే పనులకు, సీఎం క్లర్క్ చేసే పనులకు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారన్నారు.
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కార్డులను వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఈ భూమి పుత్రుడైతే సింగరేణికి మేలు చేయాలన్నారు. మంచిర్యాల నుంచి బొగ్గు భాయ్ యాత్ర ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో మేము ఒక ప్రాంతీయ పార్టీగా రక్షణ సేనాను ప్రారంభించామన్నారు. సింగరేణిలో చాలామంది కార్మికులను తగ్గించే కుట్ర చేస్తున్నారన్నారు. సింగరేణిలో కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కనుసన్నల్లోనే జరిగే ప్రయత్నం చేస్తుందన్నారు.
గుజరాత్ లోని గుజరాత్ మినరల్స్ అనే కార్పొరేషన్ ఉంది. మైనింగ్ మెంబెర్స్ అన్ని దాని ద్వారా నడుస్తున్నాయన్నారు. ఈ విధానాన్ని కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ మాదిరిగానే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి మైనింగ్ డెవలప్మెంట్ విధానాన్ని తెస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా చేసుకోవచ్చన్నారు. బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి బిజెపి అధికారంలోకి వచ్చాక 250 బ్లాక్స్ ను జాతీయం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నాలుగు లేబర్ కోట్ల చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే సింగరేణిలో చేస్తున్న అవినీతిని త్వరలో బయట పెడతామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని పెద్దపల్లి ఎంపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాళ్లపల్లి లో సింగరేణి కోసం భూమి ఇచ్చిన ప్రజలకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేదని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.






