​ఆంధ్ర టూ ఛత్తీస్‌గఢ్‌కు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. లారీ సీజ్

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో భారీగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని(పీడీఎస్) పోలీసులు పట్టుకున్నారు.

​ఆంధ్ర టూ ఛత్తీస్‌గఢ్‌కు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. లారీ సీజ్
X

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో భారీగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని(పీడీఎస్) పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు 28 నుంచి 30 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ​మండల కేంద్రంలో బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి సాధారణ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఒక లారీ పై అనుమానం రావడంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీ పైకి ఎక్కి పరిశీలించగా, అందులో పెద్ద ఎత్తున పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)కు చెందిన రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు.

​​లారీలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 28 నుంచి 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ఈ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ​ఈ ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Next Story