- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఫ్లాపులున్నా అస్సలు తగ్గేదేలా అంటున్న పూజా హెగ్డే.. అంత టెక్కు అవసరమా అంటున్న నెటిజన్లు!
పూజా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే నిర్మాతలు ఆమెను పక్కన పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తున్నారు. తమిళం, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ.. ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఇటీవల వచ్చిన ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. తెలుగులో 2022లో వచ్చిన ‘రాధే శ్యామ్’ తర్వాత ఆమె మరే ఇతర సినిమాలోనూ కనిపించలేదు. టాలీవుడ్‌లో ఛాన్సులు తగ్గడంతో ప్రస్తుతం ‘జననాయగన్’, కాంచన-4, దుల్కర్ సల్మాన్ ‘DQ-41’ వంటి ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది.
ఈ క్రమంలోనే పూజా హెగ్డేకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమెకు టాలీవుడ్ నుండి కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ.. పూజా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే నిర్మాతలు ఆమెను పక్కన పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె ఏకంగా రూ.5 కోట్లు అడుగుతుండటంతో, నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టలేక తక్కువ రెమ్యునరేషన్‌కు వచ్చే యంగ్ హీరోయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారట. వరుస ఫ్లాపులున్నా, ఇండస్ట్రీలో పెరుగుతున్న కాంపిటీషన్ వల్ల పూజా టాలీవుడ్‌లో మంచి అవకాశాలను కోల్పోతోందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. వరుసగా ఫ్లాపులు వస్తున్నా క్రేజ్ అస్సలు తగ్గలేదుగా, తగ్గేదేలే అంటోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు మాత్రం వరుసగా ఫ్లాపులు వస్తున్న సమయంలో అంత టెక్కు అవసరమా అని అంటున్నారు.






