- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీల నుంచి సగం బడ్జెట్ వచ్చే రోజులు పోయాయి.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సగం డబ్బులు కేవలం ఓటీటీల నుండే తిరిగి రాబట్టుకోవచ్చని నిర్మాతలు నమ్మే వారని, కానీ ఇప్పుడు ఆ రోజులు పూర్తిగా మారిపోయాయని ఆయన స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఓటీటీ బిజినెస్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సగం డబ్బులు కేవలం ఓటీటీల నుండే తిరిగి రాబట్టుకోవచ్చని నిర్మాతలు నమ్మే వారని, కానీ ఇప్పుడు ఆ రోజులు పూర్తిగా మారిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న రోజుల్లో ఓటీటీ సంస్థలు ఏ సినిమా పడితే ఆ చిత్రాన్ని కొనడం లేదని అన్నారు. ఏ మూవీస్‌ను డిజిటల్ రైట్స్ ద్వారా కొనుగోలు చేయాలనే విషయంలో వారు చాలా జాగ్రత్తగా, లెక్కలు వేసుకుని మరీ ఎంపిక చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. థియేటర్లలో ఏ సినిమాలకు ఆదరణ ఉంటుంది, ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు నచ్చుతుంది అనేది ఓటీటీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి సినిమాకు ఓటీటీ నుండి భారీగా బిజినెస్ జరుగుతుందని ఆశించడం ఇప్పుడు కష్టంగా మారిందని అన్నారు.
ఇండస్ట్రీలో నిలకడగా సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్లకు ఉండే క్రేజ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. "సమాజంలో, ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉండి, వరుసగా హిట్ చిత్రాలను అందించే నిర్మాతలకు ఓటీటీ మార్కెట్‌లో కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రాధాన్యత ఉంటాయనేది నిజం. ఓటీటీ సంస్థలు కూడా అలాంటి పేరున్న పెద్ద బ్యానర్లను, వారి ట్రాక్ రికార్డును గౌరవిస్తాయి. ఆ నమ్మకంతోనే సదరు పెద్ద బ్యానర్ల సినిమాలకు మిగతా వాటికంటే కొంచెం ఎక్కువ రేటు చెల్లించడానికి ముందుకు వస్తాయి" అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.






