న్యాయం చేయండి: చంద్రబాబును కోరిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 10:09:55  IST  )

సీఎం చంద్రబాబు నాయుడును సాయికృష్ణ తల్లితోపాటు కుటుంబసభ్యులను కలిశారు. తమకు న్యాయం చేయాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోరారు. దీంతో ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ..

న్యాయం చేయండి: చంద్రబాబును కోరిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు
X

దిశ, వెబ్ డెస్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu naidu)ను సాయికృష్ణ తల్లితోపాటు కుటుంబసభ్యులను కలిశారు. తమకు న్యాయం చేయాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోరారు. దీంతో ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సాయికృష్ణ కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశామని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష తప్పదని సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ

కాగా రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మార్కాపురంలో సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులకు సాయికృష్ణను చంపేశామని తల్లి విజయలక్ష్మితో సీఐ నాగరాజు చెప్పడంతో ఈ ఘటన మరింత సీరియస్ అయింది. తన కుమారుడి ఆచూకీ మిస్ అయిందని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దీంతో సాయికృష్ణను కోర్టులో ప్రవేశ పెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు బతికుంటే చూపించాలని లేనిపక్షంలో బూడిదైనా చూపించాలని వేడుకున్నారు.

పెను సంచలనంగా సాయికృష్ణ ఉదంతం

దీంతో సాయికృష్ణ ఉదంతం పెను సంచలనంగా మారింది. ‘‘అసలు సాయికృష్ణ ఏమయ్యారు. పోలీసులు చంపేశారా..?, లాకప్ డెత్ అయితే విషయాన్ని బయటకు రాకుండా చేశారా.. అనే అనుమానాలు, ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంటరైంది. సాయికృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వమే సాయికృష్ణను హత్య చేయించిందని విమర్శలు చేశారు.

ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఈ నేపథ్యంలో సాయికృష్ణ మిస్సింగ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ అయింది. కృష్ణలంక సీఐను సస్పెండ్ చేయడంతో పాటు కేసు సైతం నమోదు చేయించింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ షురూ చేశారు. ఇప్పటికే సాయికృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను తీసుకుంది. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనూ విచారణ షురూ చేశారు.

Next Story