- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో సాయంత్రం వరకు ఎండలు.. రాత్రికి 12 జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!
తెలంగాణలో సాయంత్రం వరకు పొడి వాతావరణం.. రాత్రికి వికారాబాద్, ఆదిలాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినప్పటికి వాతావరణంలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి, మరికొన్ని జిల్లాల్లో కనిస తొలకరి జల్లులు కూడా పడటం లేదు. ఓ వైపు వర్షాలు పడి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వర్షాలపై వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు తెలంగాణలో ఎండలు తీవ్రత అధికంగా ఉంటుందని, సాయంత్రం తర్వాత వాతావరణం మారుతుందని తెలిపింది.
అలాగే రాత్రి 12 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వికారాబాద్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా సాయంత్రం వరకు ఎండ తీవ్రత పెరిగి, ఉక్కపోతతో కూడిన పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత రాత్రి వేళల్లో నగరంలో వాతావరణం మారి, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ముఖ్యంగా హైదరాబాద్ తూర్పు ప్రాంతాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని, ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.






